శాస్త్రీయ నృత్య, సంగీత విశిష్టత యువతకు తెలపాలి

ABN , First Publish Date - 2021-10-17T06:26:09+05:30 IST

భారతీయ సంస్కృతికి అద్దంపట్టే శాస్త్రీయ సంగీతం, నృత్య విశిష్టతను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి అన్నారు.

శాస్త్రీయ నృత్య, సంగీత విశిష్టత యువతకు తెలపాలి
కళాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన దృశ్యం

ఏలూరు కల్చరల్‌, అక్టోబరు 16 : భారతీయ సంస్కృతికి అద్దంపట్టే శాస్త్రీయ సంగీతం, నృత్య విశిష్టతను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చిన సత్యం 92వ జయంతి సందర్భంగా జిల్లా నాట్యాచార్యుల ఆధ్వర్యంలో ప్రపంచ కూచిపూడి దినోత్సవం ఏలూరు రామకృష్ణాపు రంలోని సాహిత్య మండలి వేదికపై ఘనంగా నిర్వహించారు.అభినయ నృత్యభారతి వ్యవస్థాపకుడు బి హేమసుందర్‌ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. పలువురు నాట్య గురువులను సత్కరించారు. అనంతరం సుమారు వంద మందికి పైగా కళాకారులు తమ కళానైపుణ్యంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను అందజేశారు. కళారత్న కెవి సత్యనారాయణ, ఏపీబిఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్‌, డాక్టర్‌ డివి సుబ్బారావు, డి. సరస్వతి, డీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:26:09+05:30 IST