విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు

ABN , First Publish Date - 2022-06-28T05:27:38+05:30 IST

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని ప్రతీ ఒక్కరిలో కలిగేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.జగపతిరాజు అన్నారు.

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు
భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం

భీమవరం, జూన్‌ 27: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని ప్రతీ ఒక్కరిలో కలిగేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.జగపతిరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. యుక్తవయస్సులో బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన భారతీయ యువతలో పౌరుషాగ్ని రగిలించిన గొప్ప దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. కార్యక్రమంలో బిహెచ్‌ఐఎం. లక్ష్మి, బి.భవాని, ప్రసాద్‌, సీతారామరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.


వీరవాసరం: మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఉపాధ్యాయులు పేరెంట్స్‌ కమిటీ సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎం బి.ప్రభామంజరి, పంపన సాయిబాబు, శనివారపు ప్రసాద్‌. అడ్డాల కృష్ణ, యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, ఊసల సరసింహారావు, పద్మజరాణి, లక్ష్మి, పార్వతి, పుష్పలత, భారతి, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం టౌన్‌: స్వాతంత్ర సమరయోధుడు, మన్యం విప్లవ కారుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను పట్టణ, మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి చైర్‌పర్సన్‌ వెంకటరమణ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. మేనేజర్‌ శివాజీ, పలువురు కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు. మండలంలోని ఎల్‌బిచర్లలో అల్లూరి విగ్రహానికి గ్రామస్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవురు పెద్దిరాజు, జి.రామ్మోహన్‌, పి.శ్రీను, టి.వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, ఏసుబాబు పాల్గొన్నారు.


పెంటపాడు: బ్రిటిష్‌ వారిపై పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సేవలు చిరస్మరణీయమని ఎంపీడీవో దామోధరరావు, తహసీల్దార్‌ శేషగిరిరావు నివాళి అర్పించారు. అల్లూరి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని పెంటపాడులో ర్యాలీ నిర్వహించారు. నల్లమిల్లి విజయానందరెడ్డి, తాడేపల్లి ఈశ్వరరావు, గ్రామ కార్యదర్శి అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:27:38+05:30 IST