శిథిలావస్థలో కల్వర్టులు

ABN , First Publish Date - 2021-10-24T05:11:54+05:30 IST

ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టక పోవడంతో ఇటిక్యాల మండలంలో పలు చోట్ల రహదారులు దెబ్బ తిన్నాయి.

శిథిలావస్థలో కల్వర్టులు
చాగాపురం గ్రామ శివారులో కుంగిన కల్వర్టు

- ఏళ్ల తరబడి మరమ్మతులు శూన్యం

    ఇటిక్యాల, అక్టోబరు 23 : ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టక పోవడంతో ఇటిక్యాల మండలంలో పలు చోట్ల రహదారులు దెబ్బ తిన్నాయి. కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. ఇటిక్యాల నుంచి చాగాపురం వరకు ఇరవై ఏళ్ల క్రితం వేసిన బీటీ రోడ్డు పూర్తిగా పాడై పోయింది. దీంతో వాహనాలు నడిపేవారు ప్రమాదాలకు గురవుతు న్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాగాపురం శివారులోని కల్వర్టు కుంగి పోయింది. ఇటిక్యాల, ఉదండాపురం, సాతర్ల గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు రోడ్డు గుంతలమయంగా మారింది. సాతర్ల సమీపంలోని కల్వర్టు కూడా శిథిలావస్థకు చేరింది. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విష యంపై ఎమ్మెల్యే అబ్రహాం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-10-24T05:11:54+05:30 IST