పెరుగు శాండ్‌విచ్‌

ABN , First Publish Date - 2021-12-22T18:05:14+05:30 IST

బ్రెడ్‌ ముక్కలు- ఆరు, బటర్‌ - రెండు, నువ్వులు- స్పూను, గట్టి పెరుగు- ముప్పావు కప్పు, మయోనీస్‌ సాస్‌ - పావు

పెరుగు శాండ్‌విచ్‌

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు- ఆరు, బటర్‌ - రెండు, నువ్వులు- స్పూను, గట్టి పెరుగు- ముప్పావు కప్పు, మయోనీస్‌ సాస్‌ - పావు కప్పు, మిరియాల పొడి- అర స్పూను, క్యారెట్‌ తురుము- పావు కప్పు, క్యాబేజీ ముక్కలు- పావు కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు - పావు కప్పు, అల్లం ముక్కలు- అర స్పూను, కార్న్‌- పావు కప్పు.


తయారుచేసే విధానం: పెద్ద గిన్నెలో పెరుగు, మయోనీస్‌ సాస్‌, మిరియాల పొడి వేసి కలపాలి. ఇందులోనే ఉప్పు, కూరగాయల ముక్కలన్నిటినీ వేసి బాగా కలిపి పక్కనబెట్టాలి. బ్రెడ్డు ముక్కలు తీసుకుని వాటి అంచుల్ని కట్‌ చేసుకోవాలి. శాండ్‌విచ్‌ మిశ్రమాన్ని బ్రెడ్డు ముక్క మీద రాసి దానిపై ఇంకో బ్రెడ్‌తో మూసేయాలి. పెనం మీద బటర్‌ వేసి కాగాక నువ్వులు వేసి శాండ్‌విచ్‌ను దాని మీద పెట్టి రెండు వైపులా కాల్చాలి లేదా శాండ్‌విచ్‌ మేకర్‌లో కాల్చినా సరే.

Updated Date - 2021-12-22T18:05:14+05:30 IST