పెరుగు సేమ్యా

ABN , First Publish Date - 2021-01-16T19:42:00+05:30 IST

సేమ్యా - అరకప్పు, పెరుగు - ఒక కప్పు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, వేరుసెనగలు

పెరుగు సేమ్యా

కావలసినవి: సేమ్యా - అరకప్పు, పెరుగు - ఒక కప్పు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, వేరుసెనగలు - పావు కప్పు, జీడిపప్పు - గార్నిష్‌ కోసం.


తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి సేమ్యాను ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి సేమ్యా పక్కన పెట్టుకోవాలి. వాటిపై చల్లటి నీళ్లు పోస్తే సేమ్యా అంటుకుపోకుండా ఉంటుంది. తరువాత స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక  వేరుసెనగలు వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆదే పాన్‌లో మళ్లీ కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేగించాలి. 

ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమ్యా వేయాలి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి.

చివరగా పెరుగు వేసి కలపాలి. వేగించిన వేరుసెనగలు, జీడిపప్పు పలుకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.


Updated Date - 2021-01-16T19:42:00+05:30 IST