పెరుగు వడలు

ABN , First Publish Date - 2022-04-23T22:00:18+05:30 IST

మినప్పప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, పెరుగు - పావు కేజీ, గ్రీన్‌ చట్నీ - రెండు టీస్పూన్లు, చింత

పెరుగు వడలు

కావలసినవి: మినప్పప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, పెరుగు - పావు కేజీ, గ్రీన్‌ చట్నీ - రెండు టీస్పూన్లు, చింతపండు చట్నీ - రెండు టీస్పూన్లు, కారం - చిటికెడు, జీలకర్రపొడి - చిటికెడు, చాట్‌ మసాల - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ: ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పులో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. మినప్పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వడలు వత్తుకుంటూ నూనెలో వేయాలి. చిన్నమంటపై వడలు గోధుమరంగులోకి మారే వరకు వేయించాలి. అలా వేయించుకున్న వడలను గోరు వెచ్చటి నీళ్లలో వేయాలి. ఐదు నిమిషాల పాటు ఉంచితే వడలు నీటిని పీల్చుకుంటాయి. తరువాత వడలను చేతుల్లోకి తీసుకుంటూ ఒత్తి నీరు పోయేలా చేస్తూ మరో బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ వడలపై పెరుగు పోయాలి. గ్రీన్‌ చట్నీ, చింతపండు చట్నీ వేయాలి. కారం, జీలకర్రపొడి, చాట్‌ మసాల చల్లుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. 


Updated Date - 2022-04-23T22:00:18+05:30 IST