అన్నీ బంద్‌

ABN , First Publish Date - 2021-05-07T05:42:41+05:30 IST

కొవిడ్‌ కట్టడికి ప్రకటించిన 14 రోజుల పాక్షిక కర్ఫ్యూ జిల్లా లో రెండో రోజూ విజయవంతమైంది.

అన్నీ బంద్‌
ఏలూరులో నిర్మానుష్యంగా మారిన రోడ్లు

రెండో రోజు విజయవంతమైన కర్ఫ్యూ

ఏలూరులో విచిత్ర పరిస్థితి.. ట్రాఫిక్‌ జామ్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

కొవిడ్‌ కట్టడికి ప్రకటించిన 14 రోజుల పాక్షిక కర్ఫ్యూ జిల్లా లో రెండో రోజూ విజయవంతమైంది. గురువారం ఉదయం నుంచే కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మా రాయి. పట్టణాల్లో అత్యవసర సేవలు, పెట్రోలు బంకులు మినహా సకలం బంద్‌ అయ్యాయి. వాహనాలు పెద్దగా కనిపించలేదు. ఆసుపత్రులకు, టీకా కోసం పీహెచ్‌సీలకు వెళ్లేవారు మాత్రమే రోడ్లపైకి వచ్చారు. భీమవరం, పాలకొల్లు లో కొద్దిపాటి రద్దీ కనిపించింది. రెండో రోజు తీరప్రాంత పట్ట ణాల్లో ఒకింత రద్దీ పెరిగింది. తొలిరోజుకంటే ఎక్కువ మంది ప్రజలు రోడ్లపైకి, మార్కెట్లు, దుకాణాల వద్ద దర్శనమిచ్చారు. భీమవరం, పాలకొల్లులో ఉదయం పది గంటల సమయంలో సాధారణస్థాయిలో రద్దీ కనిపించింది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనంతో జంగారెడ్డిగూడెంలో గురువారం సందడి నెలకొంది. ఏలూరులో విచిత్ర పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగానూ, మరికొన్ని అధిక రద్దీతో కనిపించాయి. ఏలూరు రైతుబజారు జనం లేక  వెలవెల బోగా.. మెయిన్‌ బజార్‌, ఆర్‌ఆర్‌ పేటలు రద్దీగా కనిపించాయి. మధ్యాహ్నం 12 లోపు ఇళ్లకు చేరుకోవాల్సి ఉండడంతో జన మంతా ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో ఏలూరులో ట్రాఫిక్‌ జామయింది. గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణకే ఓటేశారు. బుధవారంకంటే గురువారం జన సంచారం బాగా తగ్గింది. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు పట్టణాల్లోను ఉదయం ఆరు నుంచే సందడి తగ్గింది. 

తొలిరోజు అనుభవంతో ప్రజలు ఎవరికి వారే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. టీ, టిఫిన్‌, భోజనాలను వెంట తెచ్చుకున్నారు. ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఉదయం నామమాత్రపు ప్రయాణికులతో బస్సులు నడిచాయి. తొలిరోజు ప్రయాణ సదుపాయం లేక ఇబ్బంది పడిన ఏజెన్సీ ప్రజలు 12 లోపే ఇంటి బాట పట్టారు. దీంతో రెండో రోజు పోలీసులకు పని తప్పింది.  సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన గస్తీ ఏర్పాట్లు చేసి ఇతర రాష్ట్రాల, జిల్లాల వాహనాలను లోని కి రాకుండా జాగ్రత్త పడ్డారు. 


Updated Date - 2021-05-07T05:42:41+05:30 IST