కరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2021-04-21T06:19:31+05:30 IST

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ కీలక నిర్ణయం తీసుకుందని రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

కరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 20 : కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ కీలక నిర్ణయం తీసుకుందని రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ జీవోనెంబర్‌ 87 ప్రకారం ఈ రోజు నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు ప్రతీరోజూ రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. రాత్రి 8 గంటలకే కార్యా లయాలు, దుకాణాలు, హోటళ్లు మూసి వేయాలన్నారు. కర్ఫ్యూ నుంచి మీడి యాకు మినహాయింపు సమాచార సేకరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుందని, ఫార్మసీలు, ల్యాబ్‌లు, పెట్రోల్‌బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింద న్నారు. టికెట్‌ కలిగిన విమాన, రైలు బస్సు ప్రయాణికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందని, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. జిల్లాలో 1100 పడకలు కొవిడ్‌ ట్రీట్మెంట్‌ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొవిడ్‌ టెస్టులు రోజుకు 2000లు జరుగుతున్నాయన్నారు. రాబోయే రెండువారాల్లో ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రోజుకు 6 వేల నుండి 7 వేల వరకు ఫస్ట్‌, సెకండ్‌డోస్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. 85 వేల మందికి ఫస్ట్‌డోస్‌ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ శానిటేషన్‌, మాస్క్‌, భౌతికదూరం పాటించి కోవిడ్‌ నియంత్రణకు సహకరించాలని కోరా రు. నేటి నుండి తనిఖీలు చేయడం జరుగుతుందని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కమార్‌ మాట్లాడుతూ రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయడం జరుగుతుంది. అత్యవసర సమయంలో బయట కు వెళ్లే వారు సెల్ఫ్‌ ఐడెంటికార్డు చూపించి వెళ్లవలసి ఉంటుందని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్‌ రూమ్‌నెంబర్‌ 9440900680కు కాల్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌, సూపరింటెండెంట్‌ దేవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించండి

జిల్లాలోని సినిమాహాళ్లు, పెట్రోల్‌పంపులలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సినిమాహాళ్లు, పెట్రోల్‌పంపుల యజమానులతో కొవిడ్‌ నిబంధనలపై నిర్వహించిన సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రోజు రోజూకు కరోనాకేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాహాళ్లు, పెట్రోల్‌ పంపులలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. కొవిడ్‌ నియంత్రణకు నో మాస్క్‌ నో టికెట్‌, నో మాస్క్‌ పెట్రోల్‌ నిబంధనలను అమలు చేయాలని సూచించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సిబ్బంది నిబం ధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, ఎలాంటి అనుమానాలున్న తప్పక కొవిడ్‌ చికిత్సలు చేయించుకోవాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, కోవిడ్‌ నియంత్రణకు ప్రతీఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అద నపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, సినిమాహాళ్లు, పెట్రోల్‌ పంపుల యజమా నులు, తదితరులు పాల్గొన్నారు. 

మామడ, ఏప్రిల్‌ 20 : కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. మంగళవారం రోజున అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి మామడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించారు. కొవిడ్‌వ్యాక్సిన్‌ వేసే విధానాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు లేకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని తెలిపారు. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరి వెంట ఎంపీడీవో రమేష్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, వైద్యాధికారి మహిత, సిబ్బంది మధుకర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T06:19:31+05:30 IST