కర్ఫ్యూ కట్టుదిట్టం

ABN , First Publish Date - 2021-05-07T04:59:31+05:30 IST

వైరస్‌ వ్యాప్తి ని వారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలు పులివెందుల లో కట్టుదిట్టంగా అమలవుతున్నాయి.

కర్ఫ్యూ కట్టుదిట్టం
పులివెందులలో కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

అత్యవసరాల మేరకే రోడ్లపైకి అనుమతి

నిర్మానుష్యంగా వీధులు

పులివెందుల టౌన, మే 6: వైరస్‌ వ్యాప్తి ని వారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలు పులివెందుల లో కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గం టలకే ప్రధానవీధుల్లోని దుకాణాలను మూసి వేస్తున్నారు. పూలంగళ్ల సర్కిల్‌, బస్టాండ్‌ కూడలి, మండల పరిధిలోనూ కిరాణ దుకా ణాలను నిబంధనల మేరకు మూసివేయిస్తు న్నారు.

దీతో పట్టణం నిర్మానుష్యంగా మారు తోంది. ప్రధాన కూడలిలోని ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌, పూలంగళ్ల సర్కిల్‌లలో తనిఖీ నిర్వహించిన పోలీసులు అవసరమైన వారినే అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనాకు అడ్డుకట్ట వేయాలం టే ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నరసిం హారెడ్డి, సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

పులివెందుల రూరల్‌, మే 6: కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కర్ఫ్యూను పోలీసు లు పర్యవేక్షిస్తూ ఆటో ద్వారా ప్రచారం చేయి స్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి పోలీసులు జరిమానా విధిస్తూ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

బద్వేలులో....

బద్వేలు, మే 6: కరోనా కట్టడిలో ప్రభుత్వం చేపట్టిన పగటి కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసా గుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం  రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ వెలవెలబోతు న్నాయి. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పట్టణంలో తోపుడు బండ్ల వారు నిబంఽధనలు పాటించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని అర్బన్‌ సీఐ రమే ష్‌బాబు హెచ్చరించారు.

పోలీసు స్టేషన్‌ ఆవ రణలో తోపుడుబండ్ల వ్యాపారులతో ఆయన మాట్లాడుతూ  మాస్కులు ధరించి శానిటైజ ర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ వ్యాపా రాలు చేసుకోవాలని ఆయన సూచించారు. 

బి.మఠంలో....

బ్రహ్మంగారిమఠం, మే 6: బ్రహ్మంగారిమఠం కూడలిలో కరోనా నివారణపై ప్రజలకు, యువకులకు బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు అవగాహన చేపట్టారు. రోడ్లపై ఇష్టానుసా రంగా తిరగవద్దని సూచించారు. 

గ్రామాల్లో హైపోక్లోరైట్‌ పిచికారి

చాపాడు, మే 6: వెదురూరు, రాజుపాళెం, నరహరిపురం, చాపాడు, పెద్దగురవలూరు, పల్లవోలు తదితర గ్రామాల్లో అధికారులు  హైపోక్లోరైట్‌ పిచికారి చేశారు. కరోనా ఎక్కు వగా ఉన్నందున పారిశుధ్య పనులు చేస్తు న్నారు. ఇందులో భాగంగా వీధుల్లో, కాల్వల్లో, మురికి కుంటల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నా రు. హైపోక్లోరైట్‌ పిచికారి చేస్తున్నందున గ్రా మాలు శుభ్రంగా ఉంటాయని సర్పంచులు పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శులు గ్రామ వలంటీర్లు పిచికారి చేయిస్తున్నారు.





Updated Date - 2021-05-07T04:59:31+05:30 IST