Sonali Phogat: కర్లీస్ రెస్టారెంట్‌ కూల్చివేతకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-08T23:08:28+05:30 IST

గోవాలోని కర్లీస్ (Curlie's) రెస్టారెంట్‌ కూల్చివేతకు జాతీయ హరిత ట్రైబ్యునల్

Sonali Phogat: కర్లీస్ రెస్టారెంట్‌ కూల్చివేతకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ : గోవాలోని కర్లీస్ (Curlie's) రెస్టారెంట్‌ కూల్చివేతకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) ఆదేశాలు ఇచ్చింది. తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించి దీనిని నిర్మించినట్లు నిర్థరించింది. దీనిని కూల్చేయాలని అంతకుముందు గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. బీజేపీ నేత సోనాలీ ఫోగట్ అనుమానాస్పద స్థితిలో మరణించడానికి ముందు ఈ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 


సోనాలీ (Sonali Phogat) మరణానికి ముందు కర్లీస్ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నారని, అక్కడే ఆమెకు బలవంతంగా మాదక ద్రవ్యాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. 


ఇదిలావుండగా, కర్లీస్ రెస్టారెంట్‌ను హరిత చట్టాలను ఉల్లంఘించి నిర్మించినట్లు గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్థరించింది.  జూలైలో జరిగిన సమావేశంలో దీనిని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కర్లీస్ యాజమాన్యం ఎన్‌జీటీలో దీనిపై అపీలు చేసింది. అంతకుముందు బోంబే హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. 


ఫిర్యాదుదారు కాశీనాథ్ షెట్యే ఆరోపణల ప్రకారం, కర్లీస్ బార్ అండ్ నైట్ క్లబ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్‌ను ఉల్లంఘించింది. 


Updated Date - 2022-09-08T23:08:28+05:30 IST