Viral Video: రోడ్డుపై చెల్లాచెదురుగా డబ్బు.. నోట్లను ఏరుకోవడంలో పోటీపడ్డ ప్రయాణికులు

ABN , First Publish Date - 2021-11-21T14:25:29+05:30 IST

వాహనాల్లో హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ప్రయాణికులు.. రోడ్డుపై పడి ఉన్న భారీ నగదును చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తమ స్పీడుకు బ్రేకులు వేసి.. వాహనాల నుంచి కిందకు దిగారు. అనంతరం రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును పరిశీ

Viral Video: రోడ్డుపై చెల్లాచెదురుగా డబ్బు.. నోట్లను ఏరుకోవడంలో పోటీపడ్డ ప్రయాణికులు

ఇంటర్నెట్ డెస్క్: వాహనాల్లో హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ప్రయాణికులు.. రోడ్డుపై పడి ఉన్న భారీ నగదును చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తమ స్పీడుకు బ్రేకులు వేసి.. వాహనాల నుంచి కిందకు దిగారు. అనంతరం రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును పరిశీలించారు. ఫేక్ నోట్లు కాదని నిర్ధారించుకుని.. వాటిని ఏరుకోవడంతో పోటీ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న దక్షిణ కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బడ్‌లో ఓ ట్రక్కు హైవేపై వేగంగా వెళ్తున్న దూసుకువెళ్తోంది. ఈ క్రమంలోనే ఆ ట్రక్కు నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో ఉన్న డబ్బు సంచలు జారిపడ్డాయి. దీంతో నోట్లు.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులు.. హైవేపై చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూశారు. వెంటనే వారి వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసి..  ఆ నోట్లను పరిశీలించారు. ఆ తర్వాత అవి ఫేక్ నోట్లు కాదని నిర్ధారించుకుని.. రోడ్డుపై పడి ఉన్న భారీ డబ్బును ఏరుకోవడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌ అయింది. 




ఇదిలా ఉంటే.. దీనిపై యూఎస్ అధికారులు స్పందించారు. శాన్‌డిగో నుంచి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుకు ట్రక్కు ద్వారా డబ్బును తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. ట్రక్కు డోరు తెరుచుకోవడంతో ఇలా జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రోడ్డుపై నుంచి డబ్బును తీసుకున్న వారు.. తిరిగి ఆ మొత్తాన్ని ఇచ్చేయాలని స్పష్టం చేశారు. లేదంటే.. సదరు వ్యక్తులపై కేసులు పెడతామని హెచ్చరించారు.





Updated Date - 2021-11-21T14:25:29+05:30 IST