మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు

ABN , First Publish Date - 2020-12-03T06:16:39+05:30 IST

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుపై రైతులకు ఎటువంటి భయాలు, అపోహలు అక్కరలేదని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాథరావు వెల్లడించారు. బుధవారం జిల్లా పర్యాటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో పలు డివిజన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు.

మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు
మాట్లాడుతున్న సీఎండీహరినాథరావు

రైతులపై ఎలాంటి భారం పడదు

ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాథరావు

అనంతపురంరూరల్‌, డిసెంబరు 2 : వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుపై రైతులకు ఎటువంటి భయాలు, అపోహలు అక్కరలేదని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాథరావు వెల్లడించారు. బుధవారం జిల్లా పర్యాటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో పలు డివిజన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడతామన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు ఎలాంటి భారం పడదని తెలియజేస్తామన్నారు. మీటర్ల ఏర్పాటు కేవలం విద్యుత్‌ వినియోగం, ఎక్కడ విద్యుత్‌ దుర్వినియోగం అవుతోంది తదితర విషయాలను తెలుసుకోవడానికేనన్నారు. దీనివలన రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. కొవిడ్‌ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల మెటీరియల్‌ లేకుండా పో యిందన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలు తలెత్తుతున్నాయని ప్రస్తుతం సమస్య నుంచి కొంత ఉపశమనం వచ్చిందన్నారు. ఇటీవల జిల్లాకు ట్రాన్స్‌ఫార్మర్లు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14 మంది వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు కట్టినట్టు తెలిపారు. వారిలో హెచ్‌వీడీఎ్‌స పథకం కింద కొన్ని కనెక్షన్లు ఉన్నాయన్నారు. వాటి మినహా మిగిలిన వారందరికీ మార్చి లోపు మంజూ రు చేస్తామన్నారు. 17 కనెక్షన్లకు అంచనాలు వేయాల్సి ఉందన్నారు.  పంచాయతీల నుంచి బకాయిలు రాగానే ఉద్యోగులు, కార్మికుల వేతనాల చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ వరకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:16:39+05:30 IST