TS News: ఇదెక్కడి చోద్యం .. కరెంట్ బిల్లు ఏకంగా 7 లక్షలు..

ABN , First Publish Date - 2022-08-09T21:59:57+05:30 IST

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు లక్షల్లో వచ్చింది.

TS News: ఇదెక్కడి చోద్యం .. కరెంట్ బిల్లు ఏకంగా 7 లక్షలు..

నల్గొండ జిల్లా (Nalgonda District) : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు (Current bill) ఏకంగా లక్షల్లో వచ్చింది. మిడమానూరు మండలం, మారుపాకకు చెందిన అంజయ్యకు ఈ నెల బిల్లు రూ. 7 లక్షల 18వేల 64 వచ్చింది. దీంతో ఆయన కంగుతిన్నారు. తనకు రెండు గదుల ఇల్లు ఉందని, ప్రతినెల రూ. 150 లోపే కరెంట్ బిల్లు వస్తుందని చెప్పారు. ఇదేంటని విద్యుత్ శాఖ అధికారులను అడిగితే మీటర్ రీడింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగిందని, సరిచేస్తామని హామీ ఇచ్చారని అంజయ్య తెలిపారు.

Updated Date - 2022-08-09T21:59:57+05:30 IST