తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

ABN , First Publish Date - 2022-05-29T06:02:29+05:30 IST

గుండాల తహసీల్దార్‌ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడం వల్ల శనివారం విద్యుత్‌ శాఖ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ను కట్‌చేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి న వారితో పాటు రిజిష్ర్టేషన్‌కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు.

తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌
విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రిజిస్ర్టేషన్‌లు లేక తహసీల్దార్‌ కార్యాలయం బయట నిరీక్షిస్తున్న ప్రజలు

పెండింగ్‌ బిల్లు చెల్లించాల్సిందేనన్న అధికారులు

మధ్యాహ్నం వరకు నిలిచిన రిజిస్ట్రేషన్లు 


గుండాల, మే 28: గుండాల తహసీల్దార్‌ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడం వల్ల శనివారం విద్యుత్‌ శాఖ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ను కట్‌చేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి న వారితో పాటు రిజిష్ర్టేషన్‌కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. నవంబరు 2021 నుంచి ఇప్పటి వరకు రూ.71,107 బిల్లు పెండింగ్‌లో ఉండడంతో విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో రెవెన్యూ కార్యాలయంలో శనివారం జరగాల్సిన రిజిస్ట్రేషన్లు మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి. తహసీల్దార్‌ శ్రీనివా్‌సరాజ్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎట్టకేలకు మధ్యాహ్న సమయంలో తిరిగి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. కరెంట్‌ నిలిపి వేస్తున్న విషయమై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్‌ కట్‌ చే శారని తహసీల్దార్‌ తెలిపారు. దీంతో కార్యాలయంలో కరెంట్‌ లేకపోవడంవల్ల రిజిస్ర్టేషన్లు మధ్యాహ్నం వర కు చేయలేకపోయినట్లు తెలిపారు. ఈ విషయమై ఏఈ భరత్‌ కుమర్‌ను వివరణ కోరగా గత ఏడు నెలలుగా బిల్లు చెల్లించక పోవడంతో కరెంట్‌ కట్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

Updated Date - 2022-05-29T06:02:29+05:30 IST