కరెంట్‌ కట్‌కట

ABN , First Publish Date - 2022-06-26T05:19:43+05:30 IST

ఆరు జిల్లాల ఆరోగ్య సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి.

కరెంట్‌ కట్‌కట
కరెంటు పోవడంతో రోగులు ఇబ్బందులు

  1. జీజీహెచలో వెంటాడుతున్న విద్యుత సమస్య
  2. తరచూ విద్యుత అంతరాయంతో ఇబ్బందులు
  3. ఈ నెలలో ఐదుసార్లు నిలిచిపోయిన పవర్‌
  4. నిపుణులైన ఎలక్ర్టీషయన్లు లేకపోవడమే కారణం

కర్నూలు(హస్పటల్‌) జూన 25: ఆరు జిల్లాల ఆరోగ్య సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెలలో ఐదుసార్లు విద్యుత అంతరాయం ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. తరచూ కరెంటు పోవడం వల్ల వైద్య సేవలకు ఇబ్బందిగా మారింది. ఈనెల 20వ తేదీన గైనిక్‌ విభాగంలో జనరేటర్‌ బ్యాటరీ పేలిపోయి దాదాపు 20 నిమిషాలు విద్యుత సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు నరకయాతన అనుభవించారు. ఐసీయూలో ఉన్న నవజాత శిశువులు కూడా ఇబ్బందులు పడ్డారు. మరుసటి రోజు మంగళవారం రాత్రి ఈఎనటీ వార్డులో దాదాపు 3 గంటలు కరెంటు నిలిచిపోయింది. దీంతో రాత్రి చీకట్లో రోగులు అల్లాడిపోయారు. 

నిపుణులు లేకపోవడం వల్లే సమస్య....

ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్‌ కింద పని చేస్తున్న 107 మంది ఉద్యోగులను మార్చి 31న అధికారులు తొలగించారు. 107 మందిలో 10 మంది నిపుణులైన ఎలకీ్ట్రషియన్లు కూడా ఉన్నారు. పది మందిని తొలగించి అబ్కాస్‌ కింద ఓవైర్‌మెనను తీసుకున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం రెగ్యులర్‌ గ్రేడ్‌-1 ఎలక్ర్టీషియన, ట్రామ్‌కేర్‌ ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగి, ఎలకీ్ట్రషియన ఈ ముగ్గురు ఇంత పెద్ద ఆసుపత్రిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి సబ్‌స్టేషనపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో మూడు రోజుల్లో విద్యుత సమస్య ఏర్పడింది.

 2017 ఇలా...

2017లో వర్షాకాలంలో రెండు రోజులు విద్యుత అంతరాయం కలిగింది. రాత్రంతా కరెంటు పోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో ఆరుగురు ఎలకీ్ట్రషియన్లు పని చేసే వారు. ఈ ఘటనపై అప్పటి కలెక్టర్‌ సత్యనారాయణ స్పందించి అదనగా మరో ఐదుగురిని నియమించి కరెంటు సమస్య తెలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పలు సూచనలు చేశారు. 

  ఓ అధికారి నిర్ణయాల వల్లే...

ఆసుపత్రిలో ఓ అధికారి నిర్ణయాల వల్లే తరచూ విద్యుత అంతరాయం కలుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆసుపత్రిలో దాదాపు 56 పోస్టులు అబ్కాస్‌ కాంట్రాక్టు కింద భర్తీ చేశారు. ఈ పోస్టుల్లో ఎలకీ్ట్రషియన పోస్టులను అధిక సంఖ్యలో తీసుకోవాల్సి ఉండగా, ఒక్క ఎలకీ్ట్రషియనను అది కూడా తనకు అనుకూలమైన ఉద్యోగిని తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఓ పక్క నాలుగు నెలల క్రితం లేని విద్యుత సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తుతోందని కొందరు రోగులు ప్రశ్నిస్తున్నారు. నిపుణులైన ఎలక్ర్టీషియన్లు లేకపోవడంతో అనర్హులతో పనులు చేయిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు, ఇతర విభాగాల ఉద్యోగులు ఎలకీ్ట్రషియన్లుగా కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆసుపత్రి అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణులను నియమించి, కరెంటు సమస్యలను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. 

 


Updated Date - 2022-06-26T05:19:43+05:30 IST