కరివేపాకు పులుసు

ABN , First Publish Date - 2020-09-24T19:34:02+05:30 IST

కరివేపాకు - రెండు కప్పులు, ధనియాలు, జీలకర్ర - ఒక స్పూను చొప్పున, వెల్లుల్లి - ఒక గడ్డ, ఉల్లిపాయ -

కరివేపాకు పులుసు

కావలసిన పదార్థాలు: కరివేపాకు - రెండు కప్పులు, ధనియాలు, జీలకర్ర - ఒక స్పూను చొప్పున, వెల్లుల్లి - ఒక గడ్డ, ఉల్లిపాయ - 1, ఎండుమిర్చి - 4, చింతపండు - నిమ్మకాయంత, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, తాలింపు దినుసులు - తగినన్ని, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, బెల్లం - కొద్దిగా.

 

తయారీ విధానం: కడాయిలో కొద్దిగా నూనె వేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేగించాలి. వీటితో పాటు ఉల్లి, వెల్లుల్లి కలిపి ముద్దగా నూరాలి. కడాయిలో మిగతా నూనె వేసి తాలింపుతో పాటు కరివేపాకు ముద్ద వేసి వేగించి చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మరిగించి దించేముందు బెల్లం వేయాలి. 



Updated Date - 2020-09-24T19:34:02+05:30 IST