కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌

ABN , First Publish Date - 2021-10-02T17:50:46+05:30 IST

ఫ్యాట్‌ తీయని పాలు - అర లీటరు, పాల పొడి - అరకప్పు, క్రీమ్‌ - 100ఎంఎల్‌, సీతాఫలాలు - మూడు(మీడియం సైజు), పంచదార పొడి - అరకప్పు.

కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌

కావలసినవి: ఫ్యాట్‌ తీయని పాలు - అర లీటరు, పాల పొడి - అరకప్పు, క్రీమ్‌ - 100ఎంఎల్‌, సీతాఫలాలు - మూడు(మీడియం సైజు), పంచదార పొడి - అరకప్పు.


తయారీ విధానం: పాలను ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో పాల పొడి వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా చూడాలి. తరువాత పాలను స్టవ్‌పై పెట్టి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో స్టవ్‌ ఆర్పేసి క్రీమ్‌ వేయాలి. బాగా కలిపి చల్లారనివ్వాలి. చిన్న బౌల్‌లోకి విత్తనాలు తీసేసి సీతాఫలం గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జును మిక్సీ జార్‌లో వేసి, పంచదార పొడి, మరిగించిన పాలు వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత ఒక జార్‌లో పోసి గాలి పోకుండా మూత పెట్టి ఫ్రిజ్‌లో రెండు గంటలు పెట్టాలి. మళ్లీ రెండోసారి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసి, తిరిగి జార్‌లో పోసి ఫ్రిజ్‌లో కనీసం 8 గంటల పాటు పెట్టాలి. చివరగా చల్లటి ఐస్‌క్రీమ్‌ సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-10-02T17:50:46+05:30 IST