కస్టమ్‌ మిల్లింగ్‌ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-28T05:45:08+05:30 IST

జిల్లాలో బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ సంబందిత అధికారులను, మిల్లర్లను ఆదేశించారు.

కస్టమ్‌ మిల్లింగ్‌ వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రవి నాయక్‌

జగిత్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ సంబందిత అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. శుక్రవా రం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్ట ర్‌ మాట్లాడారు. రైస్‌ మిల్లరు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా రైస్‌ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌ మిల్లులు పూర్తి సామ ర్థ్యం మేర నిర్వహించాలని, యంత్రాలు బ్రేక్‌ డౌన్‌ అయితే వెంటనే మర మ్మతు చేపట్టాలన్నారు. జిల్లాలో రైస్‌ మిల్లులు 24 గంటలు పనిచేయా లన్నారు. జిల్లాలో రైస్‌ మిల్లులు అందించే సీఎంఆర్‌ రైస్‌ను భద్రపరి చేందుకు వీలుగా గోడౌన్లలో స్థలం ఏర్పాటు, హమాలీల కొరత లేకుండా చేయాలన్నారు. కొనుగోలు చేసిన వరి ధాన్యం అన్‌ లోడింగ్‌, రవాణా విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడాలని ఆదేశిం చారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జిల్లా పౌరస రఫరాల అధికారి చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ రజినికాంత్‌, పలువురు రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:45:08+05:30 IST