సామాన్లు కొని పేటీఎమ్ చేసిన కస్టమర్.. అకౌంట్‌ ఓపెన్ చేసి చూసుకుంటే షాక్!

ABN , First Publish Date - 2022-03-07T18:46:47+05:30 IST

అది రోహ్‌తక్‌లోని బిజీబిజీగా ఉండే హోల్‌సేల్ కాస్మెటిక్స్ షాపు.. అక్కడకు ఓ వినియోగదారుడు వచ్చి రూ.70 వేల విలువైన కాస్మెటిక్స్ తీసుకున్నాడు..

సామాన్లు కొని పేటీఎమ్ చేసిన కస్టమర్.. అకౌంట్‌ ఓపెన్ చేసి చూసుకుంటే షాక్!

అది రోహ్‌తక్‌లోని బిజీబిజీగా ఉండే హోల్‌సేల్ కాస్మెటిక్స్ షాపు.. అక్కడకు ఓ వినియోగదారుడు వచ్చి రూ.30 వేల విలువైన కాస్మెటిక్స్ తీసుకున్నాడు.. అనంతరం ఓనర్‌కు పేటీఎమ్ ద్వారా డబ్బులు చెల్లించాడు.. మొబైల్‌లో మెసేజ్ చూసుకున్న ఓనర్ సామాన్లు ఇచ్చి అతడిని పంపేశాడు.. తర్వాత తీరిగ్గా అకౌంట్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.. రూ.30 వేలు అతని ఖాతాలో పడలేదు.. మెసేజ్ ఓపెన్ చేసి చూసుకుంటే అసలు విషయం తెలిసింది. అది ఫేక్ ఎస్‌ఎమ్ఎస్‌గా తేలింది.


హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన సునీల్ అనే వ్యక్తి కలానౌర్ ప్రాంతంలో ఓ కాస్మెటిక్స్ షాపును నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం అతని షాపునకు ఓ వ్యక్తి వచ్చి రూ.30 వేల విలువైన సామాన్లు కొనుగోలు చేశాడు. అనంతరం షాపులో ఉన్న పేటీఎమ్ బార్‌కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు పంపాడు. మొబైల్‌కు మెసేజ్ రావడంతో ఓనర్ అతడికి సామాన్లు ఇచ్చి పంపేశాడు. ఆ తర్వాత తీరిగ్గా అకౌంట్ చూసుకుని షాకయ్యాడు. 


వినియోగదారుడు తన మొబైల్ నెంబర్‌కు డబ్బులు పడినట్టు ఓ ఫేక్ మెసేజ్ పంపినట్టు తెలుసుకున్నాడు. మెసేజ్ వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో సునీల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. 

Updated Date - 2022-03-07T18:46:47+05:30 IST