
కావలసినవి : రాగిపిండి - ఒక కప్పు, బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్ - ఒకటి, క్యాబేజీ తురుము - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, మిరియాల పొడి - అర టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, బ్రెడ్‌క్రంబ్స్ - కొద్దిగా, నూనె - సరిపడా.
తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో రాగిపిండి, క్యారెట్ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, క్యాబేజీ వేయాలి.కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కట్లెట్స్ ఆకారంలో తయారుచేసుకోవాలి. ఈ కట్లెట్స్ను బ్రెడ్‌క్రంబ్స్‌లో అద్దుకుంటూ నూనెలో వేసి వేయించాలి. డీప్ ఫ్రై అయిన తరువాత స్నాక్స్‌గా సర్వ్ చేసుకోవాలి.