వైసీపీ పాలనలో కోతలు.. వాతలు

ABN , First Publish Date - 2021-12-05T05:29:15+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు కోతలు, వాతలు తప్ప ఒరిగిందేమీ లేదని సీపీఎం కేంద్ర కమిటీ స భ్యుడు వి.శ్రీనివాసరావు విమర్శించారు.

వైసీపీ పాలనలో కోతలు.. వాతలు
మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు

అభివృద్ధి ఊసే కరువు

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలోనూ సీఎం విఫలం

భూ రాబంధులుగా అధికార పార్టీ నేతలు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు 

అద్దంకిలో పార్టీ జిల్లా మహాసభలు ప్రారంభం 

అద్దంకి టౌన్‌, డిసెంబరు 4: రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు కోతలు, వాతలు తప్ప ఒరిగిందేమీ లేదని సీపీఎం కేంద్ర కమిటీ స భ్యుడు వి.శ్రీనివాసరావు విమర్శించారు. సంక్షేమం పేరుతో ప్రచారబాకా తప్ప అభివృద్ధి ఊసే కరువైందని ధ్వజమెత్తారు. సీపీఎం తూర్పు ప్రకాశం జిల్లా 13వ మహాసభలు అద్దంకి-శింగరకొండ రోడ్డులో ఉన్న కూకట్ల కన్వెన్షన్‌లులోని పమిడి కోటయ్య ప్రాంగణంలో శనివారం ప్రా రంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల్లో ఇష్టారీ తిన కోతలు విధిస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు తగిన బుద్ధిచెప్పే రోజు లు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.4500 కోట్ల జీఎస్‌టీ నిధులు రాష్ట్రానికి తెచ్చుకోలేకపోవడం జగన్‌ చేత గానితనానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే లు భూరాబంధులుగా మారారని... మద్యం, ఇసుక మాఫియాకు వారే నేతృత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపైనా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వామపక్ష ఐక్యతను బలోపేతం చేసి దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ నెంబర్‌ వన్‌ మోసగారని, అధికారంలోకి వస్తే బ్లాక్‌ మనీని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామ ని చెప్పి రూ.15 వేలు కూడా జమ చేయలేదన్నారు. అనంతరం ప్ర కాశంను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని, రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని, జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పెంట్యాల హనుమంతరావు మహాసభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిగా సభ్యులు ఆమోదించారు. ముందుగా మహాస భలకు పార్టీ అద్దంకి డివిజన్‌ నాయకుడు గంగయ్య స్వాగతం పలి కారు. పార్టీ జెండాను రాష్ట్ర కమిటీ సభ్యుడు వై.సిద్ధయ్య ఆవిష్కరిం చారు. పార్టీ తూర్పు జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అధ్యక్షత న జరిగిన ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వర రావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవీ  కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఎస్‌కే మాబు, కంక ణాల ఆంజనేయులు, రాష్ట్ర నాయకుడు ఆండ్ర మాల్యాద్రి, ఎస్‌.అనిల్‌కు మార్‌, కారుసాల శ్రీనివాసరావు, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), సీపీఐ సీనియర్‌ సీనియర్‌ నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ యు.దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, మన్నం త్రిమూర్తులు, మున్నంగి చినబావోజీరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T05:29:15+05:30 IST