కాంగ్రెస్ అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం

ABN , First Publish Date - 2022-03-12T21:59:16+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో

కాంగ్రెస్ అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత స్తాయి వ్యవస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగబోతోంది. పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు వస్తుండటంతో పార్టీ ఎన్నికలను గతంలో ప్రకటించినదానికన్నా ముందుగానే నిర్వహించే ప్రయత్నం జరగవచ్చునని చెప్తున్నారు. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల పలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పార్టీని ప్రక్షాళన చేయాలని, పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని కొందరు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శశి థరూర్, గులాం నబీ ఆజాద్ వంటివారు తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెప్పారు. 


పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవబోతోంది. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం చేసినప్పటికీ, 403 స్థానాల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ సంపాదించగలిగింది. ఆ పార్టీకి  కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. 


ఇదిలావుండగా, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్ మాట్లాడుతూ, గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ ఐకమత్యంగా ఉండటం సాధ్యం కాదన్నారు. వారు లేకుండా పార్టీ మనుగడ సాధ్యం కాదన్నారు. 


Updated Date - 2022-03-12T21:59:16+05:30 IST