కుటుంబంలోని అందరి ఫోన్లు హ్యాక్.. ఇంట్లో గోడలకు కనిపించిన చిప్స్.. సైబర్ పోలీసుల ఎంట్రీతో నివ్వెరపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2022-06-21T20:12:19+05:30 IST

ఆ కుటుంబానికి చెందిన వారి ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి.. వారికి తెలియకుండా వారి ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు పోస్ట్ అవుతున్నాయి..

కుటుంబంలోని అందరి ఫోన్లు హ్యాక్.. ఇంట్లో గోడలకు కనిపించిన చిప్స్.. సైబర్ పోలీసుల ఎంట్రీతో నివ్వెరపోయే నిజాలు..!

ఆ కుటుంబానికి చెందిన వారి ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి.. వారికి తెలియకుండా వారి ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు పోస్ట్ అవుతున్నాయి.. దీంతో వారు సైబర్ సెక్యూరిటీ సెల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.. సైబర్ పోలీసులు వారి ఇంటికి వెళ్లి పరీక్షించగా ఇంటి గోడలు, టేబుళ్ల కింద చిన్నచిన్న చిప్‌లు కనిపించాయి.. విచారణలో ఇదంతా వారి 13 ఏళ్ల కొడుకు పని అని తేలింది.. ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ ఉండే ఆ బాలుడిని ఓ హ్యాకర్ భయపెట్టి ఇదంతా చేయించాడు అని బయటపడింది. 


ఇది కూడా చదవండి..

రోజుకు 30 బాటిళ్ల పెప్సీ తాగే అలవాటు.. 20 ఏళ్లుగా ఏడాదికి రూ.6.7 లక్షల ఖర్చు.. ప్రస్తుతం ఇతడి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..


రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ ఉండేవాడు. ఆ క్రమంలో ఒక హ్యాకర్ ఆ బాలుడిని భయపెట్టాడు. తన చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలుడు తన ఇంట్లోనే స్పై చేయాల్సి వచ్చింది. ఆ హ్యాకర్ చెప్పినట్టు ఇంట్లోని గోడలకు, టేబుళ్ల కింద చిన్న చిన్న చిన్న డివైజ్‌లు అమర్చాడు. అలాగే తల్లిదండ్రుల ఫోన్లలో మొబైల్ హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. అలాగే తల్లిదండ్రుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశాడు. 


తమ ప్రమేయం లేకుండా సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు కనిపించడం ఆ బాలుడి తల్లిదండ్రులను నివ్వెరపరిచాయి. తమ మొబైల్ ఫోన్లు కూడా హ్యాకింగ్‌కు గురైనట్టు వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు ఆ ఇంటిని పరిశీలించి అసలు విషయం బయటపెట్టారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి అసలు విషయం రాబట్టారు. 

Updated Date - 2022-06-21T20:12:19+05:30 IST