జైలు నుంచి ఫోన్ హ్యాకింగ్.. బాధితులుగా జడ్జిలు, ఐపిఎస్ అధికారులు.. అసలు దీని వెనుక ఎవరున్నారంటే..

ABN , First Publish Date - 2021-11-21T17:27:51+05:30 IST

ఈ కాలంలో సైబర్ నేరస్తులు ఏదైనా నేరం చేయడానకి అసలు ఊహకందని ఎత్తులు వేస్తున్నారు. సాధారణ ప్రజలనే కాదు.. విఐపిలను సైతం వీరు సులువుగా దోచుకుంటున్నారు. బాధితుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేయడం.. తద్వారా కోట్లు దోచకోవడం వీరికి వెన్నెతోపెట్టిన విద్య. అలాంటి ఒక నేరగాడు తాను ఏకంగా జైలు నుంచే సమాజంలో పెద్ద మనుషులను దోచుకుంటున్నానని, ఇదంగా తన చేత జైలు అధికారులే...

జైలు నుంచి ఫోన్ హ్యాకింగ్.. బాధితులుగా జడ్జిలు, ఐపిఎస్ అధికారులు.. అసలు దీని వెనుక ఎవరున్నారంటే..

ఈ కాలంలో సైబర్ నేరస్తులు ఏదైనా నేరం చేయడానకి అసలు ఊహకందని ఎత్తులు వేస్తున్నారు. సాధారణ ప్రజలనే కాదు.. విఐపిలను సైతం వీరు సులువుగా దోచుకుంటున్నారు. బాధితుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేయడం.. తద్వారా కోట్లు దోచకోవడం వీరికి వెన్నెతోపెట్టిన విద్య. అలాంటి ఒక నేరగాడు తాను ఏకంగా జైలు నుంచే సమాజంలో పెద్ద మనుషులను దోచుకుంటున్నానని, ఇదంగా తన చేత జైలు అధికారులే చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు.


మహారాష్ట్రలోని ఉజ్జైని జైలులో ఖైదీగా ఉన్న అమర్ అగర్వాల్ అలియాస్ అభిజీత్ సైబర్ హ్యాకింగ్ నేరం చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్య అతను సోషల్ మీడియాలో తన వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అతను జైలు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన చేత కొందరు జైలు అధికారులు ఒక హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్(మాల్వేర్) తయారు చేయించారని, దాని ద్వారా మొబైల్ ఫోన్, కంప్యూటర్లను హ్యాక్ చేసి కోట్లు దోచుకున్నారని చెప్పాడు. ఇప్పటికే కొంతమంది ఐపియస్ అధికారులు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారని అరోపణలు చేశాడు. తన వాదనలు నిజం అని నిరూపించడానకి తాను తయారు చేసిన వెబ్‌సైట్లు, ఈ మెయిల్ ఐడీ, యూ ట్యూబ్ ఛానెళ్ల లిస్ట్ ఇచ్చాడు.


ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ కావడంతో అవినీతి నిరోధక శాఖ, సైబర్ విభాగం పోలీసులు ఉజ్జైని జైలు అధికారులు సంతోష్ లడియా, సురేశ్ గోయల్, ధర్మేంద్ర నాందేవ్‌లను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని కేంద్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ‌ృందం విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా ఖైదీ అమర్ అగర్వాల్‌ను భోపాల్ కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు.

Updated Date - 2021-11-21T17:27:51+05:30 IST