సైబర్ నిందితుల అరెస్ట్

Sep 17 2021 @ 20:40PM

కర్నూలు: మహిళలను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరుచుకొని యువతులు, మహిళలపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న నిందితులను అరెస్ట్‌ చేసామని ఆయన పేర్కొన్నారు. ఒక నెలలోనే జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో అపరిచితులను నమ్మి మహిళలు మోసపోవద్దని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.