America లో ఉంటూ భారత్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్లో రూ.200 కోట్లు దాచుకున్న NRI.. చివరకు జరిగిందో షాకింగ్ ఘటన..!

ABN , First Publish Date - 2021-10-20T04:49:17+05:30 IST

అమెరికాలో ఉంటున్న ఎన్నారై భారత్‌లోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 200 కోట్లు దాచుకున్నారు. అయితే.. చాలా కాలంగా ఈ అకౌంట్‌తో ఎటువంటి లావాదేవీలు జరపలేదు. దీంతో.. నేరగాళ్ల కళ్లు ఆ కౌంట్‌పై పడింది.

America లో ఉంటూ భారత్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్లో రూ.200 కోట్లు దాచుకున్న NRI.. చివరకు జరిగిందో షాకింగ్ ఘటన..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉంటున్న ఎన్నారై భారత్‌లోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 200 కోట్లు దాచుకున్నారు. అయితే.. చాలా కాలంగా ఈ అకౌంట్‌తో ఎటువంటి లావాదేవీలు జరపలేదు. దీంతో.. నేరగాళ్ల కళ్లు ఆ అకౌంట్‌పై పడ్డాయి. చివరికి ఆ బ్యాంకులోని ఉద్యోగులనూ తమ కుట్రలో భాగం చేసుకున్నారు. వారి సాయంతో ఆ సొమ్మంతా నొక్కేద్దామనుకున్నారు. చివరికి పోలీసులకు చిక్కారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం పెను కలకలాన్నే సృష్టిస్తోంది. 


ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ముగ్గురు హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుట్ర వెనకున్న ప్రధాన నిందితుడు.. బ్యాంకు ఉద్యోగుల సాయంతో ఎన్నారై అకౌంట్‌కు సంబంధించి కేవైసీ వివరాలను మార్చేశాడు. సదరు ఎన్నారై.. తన అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భంలో పేర్కొన్న ఫోన్ నెంబర్‌ను పోలిన మరో నెంబర్ భారత్‌లో తీసుకుని ఆ అకౌంట్‌కు జత చేశాడు. ఆ తరువాత.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేసేందుకు ప్రయత్నించాడు. ఒకటి కాదు రెండు.. ఏకంగా 66 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో..అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు  ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై వెంటనే రంగంలోకి దిగిన సైబర్ విభాగం పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 20 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-20T04:49:17+05:30 IST