ప్రభుత్వ అధికారులపై సైబర్ వల.. ఖరీదైన కానుకలు, డబ్బు పంపించండి అంటూ కలెక్టర్ ద్వారా ఫోన్.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-02T08:19:07+05:30 IST

ఒక జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్ వచ్చింది. తనకు ఖరీదైన గిఫ్ట్ వోచర్లు పంపాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయం గురించి కొందరు అధికారులకు అనుమానం రావడంతో.. దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి...

ప్రభుత్వ అధికారులపై సైబర్ వల.. ఖరీదైన కానుకలు, డబ్బు పంపించండి అంటూ కలెక్టర్ ద్వారా ఫోన్.. చివరకు..

ఒక జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్ వచ్చింది. తనకు ఖరీదైన గిఫ్ట్ వోచర్లు పంపాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయం గురించి కొందరు అధికారులకు అనుమానం రావడంతో.. దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.


ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జిల్లా కలెక్టర్ పేరుతో ఒక సైబర్ దుండగుడు అధికారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒకరోజు బరేలీ జిల్లాలో అన్ని డిప్యూటీ కలెక్టర్లకు ఫోన్లకు జిల్లా కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో "ఎవరూ నాకు ఫోన్ చేయవద్దు. ప్రస్తుతం మీటింగ్‌లో ఉన్నాను. నేను ఒక వ్యక్తికి బహుమతి పంపాలి. కాబట్టి ఒక్కొక్కరూ పది వేల రూపాయల చొప్పున పది అమెజాన్ ఈ-గిఫ్ట్ వోచర్లు పంపండి` అని ఉంది. చివరకు అది ఓ సైబర్ నేరగాడి పని అని తేలడంతో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 


 సదరు దుండగుడు జిల్లాలోని అన్ని సిటీల మేజిస్ట్రేట్,  డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ల నుండి ఇ-గిఫ్ట్ వోచర్స్‌ను డిమాండ్ చేశాడు. అనుమానంతో డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. 


తన పేరుతో ఎవరో సైబర్ నేరగాడు వల వేస్తున్నాడని కలెక్టర్ శివకాంత్ తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ఐటీ నిపుణుల సాయం కోరినట్లు తెలిపారు.

Updated Date - 2022-05-02T08:19:07+05:30 IST