సైబర్‌ నేరాలపై అప్రమత్తం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-24T05:59:48+05:30 IST

సైబర్‌ నేరాలపై అప్రమత్తం : ఎస్పీ

సైబర్‌ నేరాలపై అప్రమత్తం : ఎస్పీ
పురస్కారాలు అందుకున్న పోలీసులతో ఎస్పీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : సైబర్‌ నేరాలు రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతున్నాయ ని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ పేర్కొన్నారు. సైబర్‌ క్రైం అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత కొలువుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు నిరుద్యోగులు, యువతను మోసం చేస్తున్నట్టు చెప్పారు.  సోషల్‌ మీడియా,  దినపత్రికల్లో యువతను ఆకర్శించేలా ప్రకటనలిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.  ‘నౌకరీ.కామ్‌, సైన్‌.కామ్‌’ వంటి జాబ్‌సైట్ల నుంచి అక్రమంగా అభ్యర్థుల బయోడేటాను సేకరిసున్నట్లు  వివరించారు.  ఆ తరువాత ఫోన్‌ చేసి తమ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయంటూ నమ్మిస్తారన్నారు. దీన్ని నమ్మి కొందరు యువకులు వారికి పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తున్నారన్నారు.  నగదు తీసుకున్న తరువాత సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇంకొందరు వర్క్‌ ఫ్రం హోం పేరిట, ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల విక్రయాల ద్వారా మోసాలు చేస్తున్నారన్నారు.  ఇలాంటి వాటిపై  సైబర్‌సెల్‌కు ఫిర్యా దు చేయాలని సూచించారు. 

వృత్తిలో ప్రతిభ కనబరిచిన 11 మంది పోలీసులకు ఎస్పీ అమిత్‌బర్దర్‌ శుక్రవారం నగదు పురస్కారాలు అందజేశారు. పురస్కా రాలు అందుకున్నవారిలో ఎస్‌ఐలు పారినాయుడు, మహమ్మద్‌ అజాద్‌ అహ్మద్‌, హెడ్‌కానిస్టేబుళ్లు కె.హరిబాబు, ఎంఎస్‌ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు భాస్కరరావు, గోపాలరావు, రమేష్‌, సూర్యనారాయణ, బాలసూ ర్యరాజు, శంకరరావు ఉన్నారు. 

 

Updated Date - 2021-07-24T05:59:48+05:30 IST