సైబర్‌ నేరాలపై అప్రమత్తం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-26T03:52:30+05:30 IST

జిల్లా ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దీపికా పాటిల్‌ సూచించారు. ఫేస్‌బుక్‌ ఆధారంగా అక్రమంగా వసూలు చేస్తున్న వైనంపై రూపొందించిన పోస్టర్‌ను ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తం : ఎస్పీ
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్పీ

 
విజయనగరం క్రైం, జూలై 25: జిల్లా ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దీపికా పాటిల్‌ సూచించారు. ఫేస్‌బుక్‌ ఆధారంగా అక్రమంగా వసూలు చేస్తున్న వైనంపై రూపొందించిన పోస్టర్‌ను ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు.  అనంతరం ఎస్పీ  మాట్లాదుతూ.. అపరిచిత వ్యక్తుల ఫేస్‌బుక్‌ రిక్వస్ట్‌లను అనుమతించొద్దన్నారు. వచ్చిన మేసేజ్‌లను స్నేహితులు పంపారో? లేదో కాల్‌ చేసి తెలుసుకోవాలని సూచించారు.  ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత నెంబరుకు నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయవద్దని, అపరిచిత ఐడీలను బ్లాక్‌ చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. ముఖ్యంగా యువత దీనిపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో న్యాయవాది కె.శ్రీనివాస్‌, పోస్టర్‌ రూపొందించిన  శ్రీరక్షా సర్వీసు మిషన్‌ బొబ్బిలి ప్రతినిధులు గంగాధర్‌, కిషోర్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు.
 
 

Updated Date - 2021-07-26T03:52:30+05:30 IST