యువత మత్తుకు దూరంగా ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-01T06:23:23+05:30 IST

యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిత్యపర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు.

యువత మత్తుకు దూరంగా ఉండాలి : కలెక్టర్‌
ర్యాలీలో కలెక్టర్‌ ఇంతియాజ్‌

యువత మత్తుకు దూరంగా ఉండాలి : కలెక్టర్‌

విజయవాడ సిటీ: యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిత్యపర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు. నషా ముక్త భారత్‌ అభియాన్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వాటి దుష్ప్రరిణామాలపై అవగాహన కలిగించే సైకిల్‌ ర్యాలీని సోమవారం తన క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్‌ ప్రారంభించారు.  అడిషనల్‌ ఎస్పీ కెవి.శ్రీనివాసులు, జేసీ. ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, నషాముక్త భారత్‌ అభియాన్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌ ఏవిడి.నారాయణరావు, ఎస్‌ఆర్‌ ఆర్‌, కేబీఎన్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:23:23+05:30 IST