నేడు వరంగల్‌లో సైక్లోథాన్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-06-26T05:49:20+05:30 IST

నేడు వరంగల్‌లో సైక్లోథాన్‌ పోటీలు

నేడు వరంగల్‌లో సైక్లోథాన్‌ పోటీలు

 సందడి చేయనున్న అంతర్‌రాష్ట్ర సైక్లి్‌స్టలు 

కమిషనరేట్‌ కార్యాలయం నుంచి రాంపూర్‌ వరకు నిర్వహణ

500కు పైగా హాజరు కానున్న సైక్లి్‌స్టలు

హనుమకొండ క్రైం, జూన్‌ 25:  అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,  అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పోలీసుల ఆధ్వర్యంలో నేడు సైక్లోథాన్‌- 2022 సైక్లింగ్‌ పోటీలు జరగనున్నాయి. వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి ప్రత్యేక ఆసక్తితో ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన సమాజం కోసం వరంగల్‌ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 

మూడు రకాలు

ఆదివారం ఉదయం 6 గంటలకు వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే సైక్లింగ్‌ పోటీల్లో 25 కిలోమీటర్ల ఫుల్‌రేస్‌, 15 కిలోమీటర్ల ఫన్‌రేస్‌, 5 కిలోమీటర్ల కిడ్స్‌ రేస్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నా రు. కమిషనరేట్‌ కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్‌, అదాలత్‌, ఎన్‌ఐటీ, కాజీపేట, మడికొండ, రాంపూర్‌ సమీపంలోని సత్యసాయి కన్వెన్షన్‌ వరకు ఈ పోటీలు సాగుతాయి. మడికొండ నుంచి తిరిగి కమిషనరేట్‌ కార్యాలయం వరకు 25 కిలోమీటర్ల దూరం పూర్తవుతుంది. పోటీలో పాల్గొనేందుకు శనివా రం రాత్రి 8 గంటల వరకు కమిషనరేట్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మంది సైక్లి్‌స్టలు ఆన్‌నైల్‌లో ఎంట్రీలు సమర్పించారు. ఉదయం 5.45గంటలకే పో లీసు కమిషనరేట్‌ కార్యాలయం మైదానం బేస్‌లైన్‌ వద్ద క్రీడాకారులు అందుబాటులో ఉండాలని నిర్వాహకులు సూచించారు.  

ఏర్పాట్లు

పోటీల కోసం వారం రోజులుగా ప్రత్యేక బృందాలు, నిర్వాహకులు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. సీపీ తరుణ్‌జోషి సైతం ప్రత్యేక రిహార్సల్స్‌లో పాల్గొని పోలీసు అధికారులకు ప లు సూచలను చేస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పోటీలపై విస్తృత ప్రచా రం చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్‌లు కట్టి ప్రజల వద్దకు సమాచారాన్ని చేరవేశారు. పోటీల సందర్భంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుల ఆటా పాటలు ఉంటాయని వెల్లడించారు. పలు వాణిజ్య సంస్థలు, ప్రైవేటు కంపెనీ ల ఆర్థిక సహాయంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 

అంతర్జాతీ క్రీడాకారులు, సినీనటులు

హనుమకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఉదయం ప్రారంభమయ్యే సైక్లోథాన్‌ సైక్లింగ్‌ పోటీలకు అంతర్జాతీయ సైక్లింగ్‌ క్రీడాకారుడు రాహుల్‌ మిశ్రా, అంతర్జాతీయ టేబుల్‌ టెన్నీస్‌ క్రీడాకారిణి నైనా జస్వాల్‌, బాలీవుడ్‌ నటుడు నకుల్‌ రోషన్‌ పాల్గొంటున్నారు. పోటీ ముగిసిన తర్వాత కమిషరేట్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. 

Updated Date - 2022-06-26T05:49:20+05:30 IST