ఈ ఏడాది తొలి తుపాను ‘అసానీ’.. విరుచుకుపడేందుకు రెడీ!

ABN , First Publish Date - 2022-03-18T00:05:51+05:30 IST

ఈ ఏడాది తొలి తుపాను ‘అసానీ’ విరుచుకుపడేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న ఇది అండమాన్ తీరాన్ని..

ఈ ఏడాది తొలి తుపాను ‘అసానీ’.. విరుచుకుపడేందుకు రెడీ!

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి తుపాను ‘అసానీ’ విరుచుకుపడేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న ఇది అండమాన్ తీరాన్ని తాకనుంది. అనంతరం బంగ్లాదేశ్, మయన్మార్ వైపుగా ప్రయాణిస్తుంది. బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మార్చి 21వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. 


దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు-ఈశాన్యం దిశగా కదిలి ఈ ఉదయం 8.30 గంటల సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 19వ తేదీవరకు దక్షణ అండమాన్ సముద్రం మీదుగా ఉంటుంది.


ఆ తర్వాత అది అండమాన్, నికోబార్ దీవుల వెంట ఉత్తరం వైపుగా కదులుతూ 20వ తేదీ ఉదయానికి అల్పపీడనంగా మారి 21న తుపానుగా మారుతుంది. ఆ తర్వాత అది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి 22న ఉదయం బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. శుక్రవారం నుంచి ఇది మరింత కల్లోలంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2022-03-18T00:05:51+05:30 IST