జవాద్ తుపాన్ ముప్పు: రంగంలోకి దిగిన Indian Navy

ABN , First Publish Date - 2021-12-04T12:44:19+05:30 IST

జవాద్ తుపాన్ ముప్పు నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సహాయ,పునరావాస చర్యలు చేపట్టేందుకు భారత నావికా దళాలను రంగంలోకి దించింది....

జవాద్ తుపాన్ ముప్పు: రంగంలోకి దిగిన Indian Navy

న్యూఢిల్లీ : జవాద్ తుపాన్ ముప్పు నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సహాయ,పునరావాస చర్యలు చేపట్టేందుకు భారత నావికా దళాలను రంగంలోకి దించింది.జవాద్ తుపాన్ శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశం ఉన్నందున రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు భారత నావికాదళం తెలిపింది.తుపాన్ వాయువ్య దిశలో కదులుతూ శనివారం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది.దీంతో తుపాన్ కదిలికలను భారత నౌకాదళం నిశితంగా పరిశీలిస్తోంది.జవాద్ తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతంలోని ప్రధాన కార్యాలయం తూర్పు నౌకాదళ కమాండ్, నావికాదళ అధికారులు సన్నాహక కార్యకలాపాలు చేపట్టారు.


13 వరద సహాయక బృందాలు,నాలుగు డైవింగ్ బృందాలను రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు భారత నావికాదళం పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాల నుంచి 54,008 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శ్రీకాకుళం జిల్లాలో 15,755 మంది, విజయనగరంలో 1,700 మంది, విశాఖపట్నంలో 36,553 మందిని రెస్క్యూ టీమ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.  ప్రభుత్వం పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో 197 వరద బాధితుల సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది.


ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి డిసెంబర్ 5 మధ్యాహ్నం పూరీకి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.ఒడిశా రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.గంజాం, గజపతి, పూరి, నయాఘర్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, కోరాపుట్, రాయగడ, కటక్, ఖోర్ధా, కంధమాల్, కియోంజర్, అంగుల్, దెంకనల్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు.


Updated Date - 2021-12-04T12:44:19+05:30 IST