సైఫర్ క్యాపిటల్ ... భారత్‌లో పెట్టుబడులు

Published: Sun, 27 Mar 2022 20:40:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 సైఫర్ క్యాపిటల్ ... భారత్‌లో పెట్టుబడులు

న్యూఢిల్లీ : భారత్‌లోని క్రిప్టో స్టార్టప్‌లలో 40 శాతం మేర పెట్టుబడి లక్ష్యంతో సైఫర్ క్యాపిటల్ $ 100 మిలియన్ బ్లాక్‌చెయిన్ ఫండ్‌ను ప్రారంభించింది. రౌనక్ జైన్ ద్వారా ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన సైఫర్ క్యాపిటల్ $ 100 మిలియన్ల బ్లాక్‌చెయిన్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అందులో 40 % భారతీయ క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైఫర్ క్యాపిటల్ అన్నది యూఏఈ ఆధారిత వెంచర్ క్యాపిటల్ సంస్థ మాత్రమే కాకుండా ఇది ఎస్‌ఓఐఆర్‌ఏజెడ్‌ఆర్, ఎస్‌ఏఎఫ్‌ఐఈ తదితర పదిహేను భారతీయ బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లకు ట్టుబడులనందించింది. ఎస్‌ఓఐఆర్‌ఏజెడ్‌ఆర్ ఓ కొత్త ‘ఎస్‌ఓఎల్‌ఏఎన్‌ఏ’ ఆధారిత వికేంద్రీకృత ప్లాట్‌ఫారమ్ కాగా ఎస్‌ఎఫ్‌ఎల్‌ఈ డిజిటల్ గుర్తింపులను, 500 కంటే ఎక్కువ డిజిటల్ ఆస్తులను నిల్వ చేస్తుంది. భారతీయ స్టార్టప్‌ల కోసం సంస్థ $ 40 మిలియన్ల సీడ్ ఫండ్‌ను రిజర్వ్ చేయనుంది. ఇందుకు కారణం... భారత్‌లో వంద మిలియన్లకు పైగా క్రిప్టోకరెన్సీ వినియోగదారులున్నట్లు అంచనాలుండడమే. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.