సెనగపప్పు చికెన్‌ ఖీమా

ABN , First Publish Date - 2020-05-09T16:16:41+05:30 IST

సెనగపప్పు - ఒక కప్పు, చికెన్‌ ఖీమా - అరకేజీ, నూనె - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, లవంగాలు - 4, నల్లమిరియాలు - నాలుగైదు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - అర టీస్పూన్‌, కారం -

సెనగపప్పు చికెన్‌ ఖీమా

కావలసినవి: సెనగపప్పు - ఒక కప్పు, చికెన్‌ ఖీమా - అరకేజీ, నూనె - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, లవంగాలు - 4,  నల్లమిరియాలు - నాలుగైదు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒకటిన్నర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు, పెరుగు - ఒక కప్పు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట. 


తయారీ: పాన్‌లో నూనె వేసి లవంగాలు, మిరియాలు వేగించాలి.


పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి.


నానబెట్టుకున్న సెనగపప్పును వేసి కలుపుకోవాలి. 


కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాల, ఉప్పు వేసి కలియబెట్టాలి.


కొద్దిగా నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. మూతపెట్టి పావుగంట పాటు ఉడికించాలి.


ఇప్పుడు చికెన్‌ వేసి కలుపుకోవాలి. పెరుగు, గరంమసాల, నెయ్యి, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసి మరో పావుగంట ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-05-09T16:16:41+05:30 IST