ఈయన డాడీ ఆఫ్ ది ఇయర్.. ఓ తండ్రిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..!

ABN , First Publish Date - 2020-09-26T20:49:12+05:30 IST

తన చిన్నారి కుమార్తె ముచ్చట తీర్చడం కోసం వింత డ్రెస్ వేసుకునేందుకు సైతం వెనుకాడని ఓ తండ్రిపై..

ఈయన డాడీ ఆఫ్ ది ఇయర్.. ఓ తండ్రిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..!

న్యూఢిల్లీ: చిన్నారి కుమార్తె ముచ్చట తీర్చడం కోసం వింత డ్రెస్ వేసుకునేందుకు సైతం వెనుకాడని ఓ తండ్రిపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. తండ్రిగా తన ప్రేమను చాటుకునేందుకు ఆయన చేసిన పని చూసి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. జో డీన్‌ అనే వ్యక్తి తన కుమార్తెకు బ్యూటీ అండ్ బీస్ట్ సినిమాలోని బెల్లా కాస్ట్యూమ్‌తో డ్రెసప్ చేశారు. అనంతరం తాను బీస్ట్ డ్రెస్ వేసుకోనా అని ఆయన అడగడంతో.. బెల్లే డ్రెస్ కూడా వేసుకోవాలంటూ ఆ చిన్నారి కోరింది. ఆమె కోరిందే తడవు డీన్ ఆ డ్రెస్ కూడా తెప్పించుకుని ధరించారు. దానిపై ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


‘‘బీస్ట్ డ్రెస్ వేసుకోనా అని అడిగాను. అయితే నువ్వు బెల్లే డ్రెస్ కూడా వేసుకోవాలని ఆమె కోరింది. వెంటనే దానికోసం ఆర్డర్ ఇచ్చాను...’’ అని డీన్ పేర్కొన్నారు. ఈ నెల 23న ఈ పోస్టు పెట్టింది మొదలు ట్విటర్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 30 వేల మంది లైక్ చేయగా... 3,500 మందికి పైగా రీట్వీట్ చేశారు. ‘‘ఈయనకు డాడీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలి. మీకు హ్యాట్సాఫ్. ప్రతి తండ్రి ఎలా ప్రేమించాలో చేసి చూపించారు..’’ అని ఓ నెటిజన్ పేర్కొనగా... ‘‘ఇది కదా మనకు ఇప్పుడు కావాల్సింది..’’ అని మరొకరు కొనియాడారు. ‘‘హీరోలందరూ కేప్స్ మాత్రమే ధరించరు.. అప్పుడప్పుడు అందమైన ఎల్లో బాల్ గౌన్స్ కూడా ధరిస్తారు..’’ అని మరొకరు చమత్కరించారు. 



Updated Date - 2020-09-26T20:49:12+05:30 IST