TTD: శ్రీవారి సేవలో హీరో రానా, సురేష్‌ బాబు

ABN , First Publish Date - 2022-09-16T01:24:57+05:30 IST

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు (Daggubati Suresh Babu), ఆయన కుమారుడు హీరో రానా (Rana) గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని

TTD: శ్రీవారి సేవలో హీరో రానా, సురేష్‌ బాబు

తిరుమల: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు (Daggubati Suresh Babu), ఆయన కుమారుడు హీరో రానా (Rana) గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ (vip) బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వారు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.


టీటీడీకి విరాళంగా ఐదు బ్యాటరీ వాహనాలు

టీటీడీకి గురువారం ఐదు బ్యాటరీ వాహనాలు విరాళంగా అందాయి. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌  కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా సుమారు రూ.30 లక్షల విలువ చేసే ఎనిమిది సీట్ల బ్యాటరీ వాహనాలను అందజేసింది. శ్రీవారి ఆలయం ముందు గురువారం ఉదయం వాహనాలకు పూజలు నిర్వహించిన తర్వాత బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ బాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వాహనాల తాళాలను అందజేశారు.  

Updated Date - 2022-09-16T01:24:57+05:30 IST