దహీ కబాబ్‌

ABN , First Publish Date - 2021-02-22T23:03:12+05:30 IST

హంగ్‌ యోగర్ట్‌ - ఒకటిన్నర కప్పు, సెనగపిండి - పావు కప్పు, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌(జీలకర్ర వేగించి పొడి చేసుకోవాలి), నూనె - సరిపడా.

దహీ కబాబ్‌

కావలిసినవి: హంగ్‌ యోగర్ట్‌ - ఒకటిన్నర కప్పు, సెనగపిండి - పావు కప్పు, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌(జీలకర్ర వేగించి పొడి చేసుకోవాలి), నూనె - సరిపడా.


తయారీ విధానం: ఒక పాత్రలో నూనె కాకుండా మిగతా పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టి ఫ్రిజ్‌లో ఒక గంటపాటు పెట్టాలి. తరువాత మిశ్రమాన్ని చేతిలో కొద్దికొద్దిగా తీసుకుంటూ టిక్కీల మాదిరిగా ఒత్తుకుంటూ పాన్‌పై వేగించాలి. నూనె వేసుకుంటూ గోధుమరంగులోకి మారే వరకు రెండు వైపులా వేగించాలి. గ్రీన్‌ చట్నీతో వేడి వేడిగా దహీ కబాబ్స్‌ను అందించాలి.


Updated Date - 2021-02-22T23:03:12+05:30 IST