పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2021-12-13T18:37:14+05:30 IST

పిల్లలు త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారినపడతారు. అలర్జీల రిస్క్‌ ఎక్కువే ఉంటుంది. అందుకే పోషకాహారం అందించడం ద్వారా

పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి.. ఎందుకంటే?

ఆంధ్రజ్యోతి(13-12-2021)

పిల్లలు త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారినపడతారు. అలర్జీల రిస్క్‌ ఎక్కువే ఉంటుంది. అందుకే పోషకాహారం అందించడం ద్వారా పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా చూడాలి. ముఖ్యంగా చలికాలంలో పిల్లలు రోజూ ఈ ఆహారం అందించేలా చూడటం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేయవచ్చు.


కోడిగుడ్లలో విటమిన్‌-డి, జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఉంటాయి. అందుకే పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. ప్రోటీన్‌ కూడా సమృద్ధిగా లభించడంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు.


పాలకూర, తోటకూర, బ్రొక్కోలి వంటి వాటిని వారంలో ఒకరోజు కచ్చితంగా పెట్టాలి. ఆరెంజ్‌, ఆపిల్‌ వంటి పండ్లు తినిపించాలి. 


నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ రోజూ తినేలా చూడాలి. చలికాలంలో పిల్లలకు ఇవి మంచి స్నాక్స్‌గా పనికొస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడతాయి.


ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మిల్లెట్స్‌ బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలకు ఈ సీజన్‌లో సజ్జలతో చేసిన రొట్టెలు ఇవ్వడం ద్వారా తగినంత ఫైబర్‌ లభిస్తుంది. 


చిలగడదుంపలో బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఇది విటమిన్‌-ఎగా మారుతుంది. రోగనిరోధకవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఇది చాలా అవసరం. 


 ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా లభించే సాల్మన్‌ వంటి చేపలను తినిపించాలి.  

Updated Date - 2021-12-13T18:37:14+05:30 IST