ఈ తల్లి కన్నీటిని వృథా కానివ్వద్దు...

Jun 17 2021 @ 13:41PM

తన గారాల పట్టిని పొదివి పట్టుకుని రోదిస్తున్న ఆ తల్లి పేరు సరస్వతి. 5 నెలల వయసున్న తన కొడుకు పొట్టపై ఉన్న మచ్చను చూస్తూ అపలేనంతగా భావోద్వేగానికి గురై ఏడుస్తోంది.


"మా వాడికే ఎందుకిలా జరిగింది? నా కొడుకు జీవితం ఇంకా మొదలైనా కాకముందే ఆ విధి వాడిని ఎందుకింత క్రూరంగా చూస్తోంది?" అంటూ కన్నీరు కారుస్తోంది నిరుపేద తల్లి సరస్వతి.


ఆ చిన్నారి పుట్టినప్పుడు తన జీవితంలో అది  పండుగ లాంటి కాలంగా సరస్వతి భావించింది. ఎంతో ప్రేమగా చూసుకునే ఒక అక్క, తండ్రి ఉన్న ఇంట్లో ఈ బాలుడు పుట్టడం ఆ కుటుంబాన్ని హరివిల్లుగా మార్చింది.


"కాలం ఎంతో ఆనందంగా సాగుతూ వచ్చింది. మేం పేదవాళ్ళమే అయినా.... మా దగ్గర డబ్బులు లేకపోయినా... సంతోషానికి కొదవ లేదు. నా భర్త రాజశేఖర్‌కి, నాకు నా పిల్లల నవ్వులు, సంతోషమే స్వర్గంలా ఉండేది" అంటూ నాటి రోజుల్ని సరస్వతి గుర్తు చేసుకుంది.


తన కొడుకు పుట్టినరోజు ఎంతో ఘనంగా చెయ్యాలని సరస్వతి ఆలోచనల్లో ఉండగా దురదృష్టవశాత్తూ... ఆ చిన్నారి పుట్టిన కొద్ది నెలల్లోనే ఆ పసివాడు తనకెలా దూరమయ్యాడో గుర్తు చేసుకోవలసిన పరిస్థితులు ఆమెకు మిగిలాయి.


సరస్వతి జీవితంలో మళ్ళీ సంతోషానికి చోటివ్వండి... నిండు హృదయంతో సహాయం చెయ్యండి.

"పుట్టిన వారం తర్వాత బాబు ఊపిరి తీసుకోవడానికి కష్టపడటం మేం చూశాం. బాబును బాగా గమనించమని డాక్టర్లు చెప్పి కొన్ని మందులు రాసిచ్చారు. నేను నెల్లాళ్ళ పాటు డాక్టర్లు చెప్పిన సూచనల్ని కచ్చితంగా పాటించాను. పరిస్థితులు మెరుగవుతున్నట్టే కనిపించాయి. పాడు కాలం పోయిందిలే అనుకున్నాను." అని చెప్పింది సరస్వతి.


కానీ, బాబు ఆరోగ్యం మళ్ళీ దెబ్బతింది. నెల రోజుల వయసున్నప్పుడు జాండీస్ వచ్చింది.


బాబును ఈ సారి ఆస్పత్రికి తీసుకెళ్ళారు తల్లిదండ్రులు సరస్వతి, రాజశేఖర్.


డాక్టర్లు బాబుకు చాలా టెస్ట్‌లు చేశారు. వాటి ఫలితాల కోసం నిరీక్షిస్తూ... తన కొడుకు ఆరోగ్యంగా ఉంటాలని సరస్వతి ప్రార్థనలు చేస్తూనే ఉంది.


అయితే, ఆమె మొర పైవాడికి చేరలేదో ఏమో... ఆమె కొడుక్కి biliary atresia with a perimembranous ventricular septal లోపం ఉందని డాక్టర్లు చెప్పారు.


ఇది బాబుకు ప్రాణాంతక సమస్య అని డాక్టర్లు తెలిపారు. వెంటనే కాలేయ మార్పిడి జరగకపోతే చాలా చాలా కష్టమన్నారు.


"ఈ వార్త వినగానే నా గుండె చెదిరిపోయింది. రాజశేఖర్ ఒక ఫాంలో పనిచేస్తుంటాడు. నేను రోజువారీ సంపాదనపై ఆధారపడే కూలీని. మేం సెలవన్నది తీసుకోకుండా పనిచేసినా మా అబ్బాయి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన రూ.20 లక్షలు ($ 27562.80) సంపాదించడం అసాధ్యం."


చివరికి చుట్టాల నుంచి అప్పు తెచ్చుకున్నా సరే.... కాలేయ మార్పిడికి అయ్యే ఖర్చును వీళ్ళు భరించి పరిస్థితి లేదు.


తన కొడుక్కి జరగాల్సిన కాలేయ మార్పిడికి దాతగా తల్లి సరస్వతి కాలేయం సరిపోయింది. తన కొడుకును కాపాడుకోవడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమేనంది. "నా కొడుకు స్థానంలోకి నేను వెళ్ళడానికి కూడా సిద్ధమే... వాడికి ఇంకా జీవితమే మొదలు కాలేదు. నా బాబుకి ఈ పరిస్థితి రావలసింది కాదు" అని కన్నీటిపర్యంతమైంది ఆ తల్లి.


ఆ పసివాడు దినదిన గండం... నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టుగా బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులు చూస్తుండటం తప్ప మరేం చెయ్యలేకపోతున్నారు.


విశాల హృదయంతో మీరు అందించే సహాయం మాత్రమే ఆ బాలుడిని కాపాడగలదు.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.