దినసరి కూలి... దాహార్తి తీర్చి!

ABN , First Publish Date - 2021-06-16T05:02:55+05:30 IST

పలాస-కాశీబుగ్గ హడ్కోకాలనీలో దినసరి కూలి తన సొంత నిధులతో బోరు ఏర్పాటుచేసి అందరి ప్రశంసలు అందుకుంది. హడ్కోకాలనీ ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో ఏటా వేసవిలో బోర్లు అడుగంటి కుళాయిల నీరు అందడంలేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ సమస్య ను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన దినసరి కూలి బోయిన కల్యాణి తాను సంపాదిం చుకున్న డబ్బులతో ఓ బోరు ఏర్పాటుచేయాలని ఆలోచించింది..

దినసరి కూలి... దాహార్తి తీర్చి!
బోరు ప్రారంభిస్తున్న చైర్మన్‌ బళ్ల గిరిబాబు, పక్కన కల్యాణి

తాను సంపాదించిన డబ్బులతో బోరు ఏర్పాటు

ప్రశంసలు అందుకుంటున్న హడ్కోకాలనీ మహిళ కల్యాణి

పలాస, జూన్‌ 15: పలాస-కాశీబుగ్గ హడ్కోకాలనీలో దినసరి కూలి తన సొంత నిధులతో బోరు ఏర్పాటుచేసి అందరి ప్రశంసలు అందుకుంది. హడ్కోకాలనీ ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో ఏటా వేసవిలో బోర్లు అడుగంటి  కుళాయిల నీరు అందడంలేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ సమస్య ను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన దినసరి కూలి బోయిన కల్యాణి తాను సంపాదిం చుకున్న డబ్బులతో ఓ బోరు ఏర్పాటుచేయాలని ఆలోచించింది.. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌కుమార్‌కు తెలియజేసి సాయం చేయాలని కోరింది. వెంటనే ఆయన హడ్కోకాలనీ శివారున ఉన్న డేకురుకొండ దిగువన బోరు ఏర్పాటు చేస్తే నీరుపడుతుందని ఆమెకు తెలియజేశారు. ఈ మేరకు రూ.లక్ష ఆమె సమకూర్చి బోరు ఏర్పాటు చేయించింది. దీనిని మంగళవారం మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ రాజగోపాల రావు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ బోరు ఏర్పాటుతో హడ్కోకాలనీలో ఉన్న రెండు ప్రధాన వీధులకు నీటి సమస్య తీరిందని, దీనిని ఏర్పాటు చేసిన కల్యాణిని అందరూ అభినందించారు. కల్యాణి పేరుమీద శిలా ఫలకం ఏర్పాటు చేయాలని సచివాలయ సిబ్బందిని కమిషనర్‌ రాజగోపాలరావు  ఆదేశించారు.

 

 

Updated Date - 2021-06-16T05:02:55+05:30 IST