పాడిపరిశ్రమను ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకోవాలి

ABN , First Publish Date - 2022-07-05T05:05:26+05:30 IST

పాడిపరిశ్రమను పత్యామ్నా యంగా ఎంచుకొని ఉపాధి పొందాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి సూచించారు.

పాడిపరిశ్రమను ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకోవాలి
బోయిన్‌పల్లిలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

-  గుజరాత్‌లో విద్యుత్‌ కోతలు..

    తెలంగాణపై విమర్శలా?

-  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, 

   ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

-  బోయిన్‌పల్లిలో పాలశీతలీకరణ

   కేంద్రం ప్రారంభం

మిడ్జిల్‌, జూలై 4:  పాడిపరిశ్రమను పత్యామ్నా యంగా ఎంచుకొని ఉపాధి పొందాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి  సూచించారు. సోమవారం మండలంలోని బోయిన్‌ పల్లి గ్రామంలో 13వేల లీటర్ల సామర్థ్యంతో ఏర్పా టు చేసిన పాలశీతలీకరణ నూతన భవనాన్ని ఎ మ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ వైపు మొగ్గు చూపాలని సూచిచా రు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాలలో ఉన్న పాడిపరి శ్ర మను సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో నేడు లాభా ల బాట పట్టించారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడి చీకట్లు అలుముకుంటాయని ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారన్నారు. నేడు దేశ ప్రధాని మోదీ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో అక్కడి ప్రజలు ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ట్టిన సంక్షేమ పథకాలను వివరి స్తునే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పాల శీతలికరణ కేంద్రం వరకు సీసీ రోడ్డును ఏర్పాటు చేసేందుకు నిధులను మంజూరు చేస్తానని, బీఎం సీకి పశువైద్యుని ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని అయన హామీ ఇచ్చారు. ఈసందర్భంగా  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులను సన్మానించా రు. కార్యక్రమంలో  డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య, బీఎంసీయూ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి,  రాష్ట్ర సంగీత నాటక అ కాడమీ మాజీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, గ్రామ సర్పంచ్‌ నారాయణ్‌రెడ్డి, ఎంపీపీ కాంతమ్మ బా లస్వామి, జడ్పీటీసీ సభ్యురాలు శశిరేఖబాలు, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, పీఎసీఎస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ తిరుపతమ్మ రవిగౌడ్‌, విజయ డైయిరీ ఉప సంచాలకులు కవి త, డీవీఏహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి,  బీఎంసీయూ మేనేజర్‌ ప్రనేష్‌, నాయకులు పాండు, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, ఎల్లయ్యయాదవ్‌, సత్యంగుప్తా, ఉ పేందర్‌రెడ్డి,  పాడి రైతులున్నారు. 

విద్యార్థుల ఉన్నతికే గురుకుల పాఠశాలలు 

జడ్చర్ల : విద్యార్థుల ఉన్నతికే రాష్ట్రంలో గురు కుల పాఠశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నా రు. జడ్చర్ల మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల లో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం అభినందించారు.  అంత కుముందు పాఠశాలలోని తరగతి గదులు, కిచెన్‌, స్టోర్‌రూంలను తనిఖీ చేశారు.  కార్యక్రమంలో ము నిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీ, కౌన్సిలర్‌లు జ్యో తి, బుక్కమహేష్‌, శశికిరణ్‌, చైతన్యచౌహన్‌, చైత న్య గౌడ్‌, నాయకులు దోరేపల్లి రవీందర్‌, పాలాది రామ్మోహన్‌, ఇంతియాజ్‌ఖాన్‌,  పాల్గొన్నారు. 

మెరుగైన విద్యను అందించడమే లక్ష్యం

రాజాపూర్‌: విద్యార్థులకు  నాణ్యమైన విద్యను అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని జ డ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రం లోని శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ బీవీ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా  పది ఫలితాల్లో అధిక మా ర్కులు సాధించిన విద్యార్థిని నికితను అభినందిం చారు. అనంతరం సీఎం సహాయనిధి నుంచి ఎని మిది మందికి మంజూరయిన ఎల్‌వో సీలను బాధి తులకు అందజేశారు. సమావేశంలో జీసీసీ చైర్మన్‌ వాల్యానాయక్‌, ఎంపీపీ సుశీల, వైస్‌ఎంపీపీ మహి పాల్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ రఘువీరారెడ్డి, జడ్పీ టీసీ, ఎంపీటీసీ సభ్యులు మోహన్‌నాయక్‌,  అభి మన్యు రెడ్డి, సర్పంచ్‌ బచ్చిరెడ్డి,  తహసీల్దార్‌ శంక ర్‌, ఎంఈవో  వెంకటయ్య, ఎంపీడీవో లక్ష్మిదేవి, ప్రి న్సిపాల్‌ పావని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:05:26+05:30 IST