‘కాళి’ పోస్టర్‌‌పై ఎట్టకేలకు స్పందించిన దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం

ABN , First Publish Date - 2022-07-07T22:49:42+05:30 IST

వివాదాస్పద ‘కాళి’ పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ ఆలయం ఎట్టకేలకు స్పందించింది. మనందరం కాళిమాత

‘కాళి’ పోస్టర్‌‌పై ఎట్టకేలకు స్పందించిన దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం

కోల్‌కతా: వివాదాస్పద ‘కాళి’ (Kaali) పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణేశ్వర్(Dakshineswar) ఆలయం ఎట్టకేలకు స్పందించింది. మనందరం కాళిమాత భక్తులమేనని, చేతిలో సిగరెట్‌తో ఉన్న పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచిందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి మద్యం  సమర్పిస్తుంటారని, మేకలను బలి ఇస్తుంటారని పేర్కొంది. అయితే, చేతిలో సిగరెట్ ఉండడం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పింది. అమ్మవారి పూజా విధానంలో బెంగాల్ వ్యాప్తంగా కొన్ని స్థిరమైన ఆచారాలు ఉన్నాయని, అందుకనే అమ్మవారికి కొందరు చేపలు నైవేద్యంగా సమర్పిస్తే మరికొందరు మాంసాన్ని భోగంగా ఇస్తారని ఆలయం వివరించింది. 


ఈ మేరకు ఆలయ అధికారులు ట్వీట్ చేశారు. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి వైన్ కూడా సమర్పిస్తారని, అది అక్కడి భక్తుల ఆచారమని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పోస్టర్‌ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దక్షిణేశ్వర్ కాళీ ఆలయం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-07T22:49:42+05:30 IST