మానవ అక్రమ రవాణా కేసులో Daler Mehndiకి జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-07-15T00:38:30+05:30 IST

పలు భాషల్లో పాటలు పాడి దేశ వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నసింగర్ దలేర్ మెహందీ (Daler Mehndi). ‘బంతి పూల జానకి’, ‘సాహోరే బాహుబలి’, ‘రెడ్డి ఇక్కడ సూడు’ వంటి పాటలు పాడి

మానవ అక్రమ రవాణా కేసులో Daler Mehndiకి జైలు శిక్ష

పలు భాషల్లో పాటలు పాడి దేశ వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న సింగర్ దలేర్ మెహందీ (Daler Mehndi). ‘బంతి పూల జానకి’, ‘సాహోరే బాహుబలి’, ‘రెడ్డి ఇక్కడ సూడు’ వంటి పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. బృంద సభ్యులుగా చూపిస్తూ అతడు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారు. ఈ కేసులో అతడికీ కోర్టు గతంలో రెండేళ్ల పాటు జైలు శిక్షను విధించింది. అయితే, దలేర్ మెహందీ జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. పాటియాలాలోని జిల్లా కోర్టు తాజాగా ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అతడిని అదుపులోకి తీసుకోవాలని చెప్పింది.   


దలేర్ మెహందీ, అతడి సోదరుడు షంషేర్ సింగ్ (Shamsher Singh)కు వ్యతిరేకంగా 19ఏళ్ల క్రితం కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళ్లితే..దలేర్ మెహందీ డబ్బులు తీసుకుని కొంత మందిని ట్రూప్ మెంబర్స్‌గా చూపుతూ అక్రమంగా అమెరికా, కెనడాలకు పంపిచారు. తిరిగి వారిని మాత్రం తీసుకుని రాలేదు. దీంతో బక్షీష్ సింగ్ అనే వ్యక్తి పాటియాలాలోని సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దలేర్ మెహందీ దాదాపుగా 10మందిని తరలించారని ఆరోపించారు. ‘‘కెనడాకు పంపిస్తామని రూ. 13లక్షలను నా నుంచి తీసుకున్నారు. నన్న అక్కడికి పంపించలేదు. డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదు’’ అని బక్షీష్ సింగ్ చెప్పారు. దీంతో దలేర్‌పై పోలీసులు కేసును నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ధాఖలు చేయగానే 35ఇతర ఫిర్యాదులు పోలీసులకు అందాయి. పోలీసుల ఈ కేసును కోర్టులో నిరూపించారు. దీంతో జుడిషీయల్ మెజిస్ట్రేట్ కోర్టు 2018లో రెండేళ్ల పాటు జైలు శిక్షను విధించింది. అనంతరం దలేర్ బెయిల్‌పై విడుదలై డిస్ట్రిక్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. తాజాగా కోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అతడిని అదుపులోకి తీసుకోవాలని చెప్పింది. 

Updated Date - 2022-07-15T00:38:30+05:30 IST