రామగుండంలో ‘దళితబంధు’ రచ్చ

ABN , First Publish Date - 2022-10-08T05:27:34+05:30 IST

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దళితబంధు రెండవ విడత లబ్ధిదారుల ఎంపికపై రచ్చ మొదలైంది.

రామగుండంలో ‘దళితబంధు’ రచ్చ
మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్లు

- కొప్పుల వద్దకు అసమ్మతి పంచాయితీ 

- సమస్య పరిష్కరిస్తానని మంత్రి హామీ 

- మేయర్‌ సారథ్యంలో కార్పొరేటర్లు, కోఆప్షన్లతో భేటీ

కోల్‌సిటీ, అక్టోబరు 7: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దళితబంధు రెండవ విడత లబ్ధిదారుల ఎంపికపై రచ్చ మొదలైంది. కార్పొరేటర్ల కోటా కింద 6 యూనిట్లు ఇవ్వాలంటూ 25మంది టీఆర్‌ ఎస్‌ కార్పొరేటర్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు లేఖ రాశారు. నాలు గురోజులుగా వరుస సమావేశాలు పెట్టుకుంటున్న అసమ్మతి కార్పొ రేటర్లు 10మంది శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్లపై ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, కన్నూరి సతీష్‌కుమార్‌, మేక ల సదానందం, రమణారెడ్డి, ఐత శివకుమార్‌, కార్పొరేటర్ల భర్తలు పాతిపెల్లి ఎల్లయ్య, నీల గణేష్‌, గణముక్కుల తిరుపతి, సలీం తది తరులు ఈశ్వర్‌ను కలిసి కార్పొరేషన్‌లో కార్పొరేటర్లకు విలువలేదని, డివిజన్లలో పనులు కావడంలేదని, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక తో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అభివృ ద్ధి పనులు జరుగక తాము ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరి స్థితి ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన ఎమ్మెల్యే చంద ర్‌, మేయర్‌ అనీల్‌కుమార్‌తో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు అసమ్మతి కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. మరో వైపు శుక్రవారం రాత్రి కార్పొరేషన్‌ కార్యాలయంలోని మేయర్‌ చాం బర్‌లో మేయర్‌ అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు సాగంటి శంకర్‌, శంకర్‌నాయక్‌, మంచికట్ల దయాకర్‌, పాముకుంట్ల భాస్కర్‌, కృష్ణవేణి, కవిత సరోజిని, బాదె అంజలి, దొం త శ్రీను, బాల రాజ్‌కుమార్‌తో పాటు కార్పొరేటర్ల భర్తలు జేవీరాజు, రాకం వేణు, పొన్నం లక్ష్మణ్‌, బొడ్డు రవీందర్‌, కోఆప్షన్‌ సభ్యులు వంగ శ్రీను, బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గోపాల్‌రావు సమావే శమయ్యారు. నాలుగు రోజులుగా టీఆర్‌ఎస్‌లోని కొందరు కార్పొట ర్లు అసమ్మతి సమావేశాలు పెట్టుకోవడం, దసరా ఉత్సవాల బహి ష్కరణ, బతుకమ్మ ఏర్పాట్లకు లైట్లు తిరస్కరించడం వంటి విష యాలపై చర్చించారు. ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా పరిష్క రించుకోవాలి తప్ప ఎమ్మెల్యేకు రాసిన లేఖలను బయటకు లీకు చేయడం తదితర విషయాలపై చర్చించారు. 

‘దళితబంధు’పై అంతర్మథనం..

రామగుండం నియోజకవర్గంలో దళిత బంధు ఎంపిక విషయం లో మొదటి దశలోనే వివాదం మొదలైంది. కార్పొరేటర్లు, కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు, బంధువులకు, ఎస్‌స్సీయేతరులకు ఇచ్చారంటూ సీపీఐ నాయకుడు మద్దెల దినేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి వ్యక్త మైంది. పలువురు కార్పొరేటర్లు లబ్ధిదారులతో బేరాలు మాట్లాడుకు ని అగ్రిమెంట్లు చేసుకోవడం కూడా వివాదాన్ని రేపింది. ఇప్పుడు మళ్లీ ఒక్కో కార్పొరేటర్‌కు ఆరు దళిత బంధు యూనిట్లు కావాలం టూ డిమాండ్లు పెట్టడం టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లోనే అసంతృప్తిని రాజే స్తోంది.టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన వారికంటే స్వతంత్రులు, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి ఓటమిపాలైన వారు, అసెంబ్లీ, పార్లమెం ట్‌ ఎన్నికల్లో పనిచేసిన వారు ఇప్పుడు దళిత బంధులో డివిజన్లలో ప్రాధాన్యత ఇవ్వాలనే వాదనను వినిపిస్తున్నారు. 25మంది అధికార పార్టీ కార్పొరేటర్లు సంతకాలు పెట్టి ఆరు యూనిట్లు కావాలనే డిమాండ్‌ పెట్టి ఇప్పుడు ఇరుకునపడ్డారు. తాము డివిజన్లలో అర్హుల కోసమే అడిగామని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటున్నారు. 

ఎమ్మెల్యేకు వీర విధేయులం..

మేయర్‌, డిప్యూటీ మేయర్ల సారధ్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకు లేఖరాసిన పలువురు కార్పొరేటర్లు కూడా హాజరై తాము ఎమ్మెల్యేకు వీర విధేయులమంటూ చెప్పుకొచ్చినట్టు తెలుస్తున్నది. తమతో సంతకాలు తీసుకుని దుర్వినియోగం చేశారని పేర్కొన్నట్టు సమాచారం. కొందరు కార్పొరేటర్లు అసమ్మతి సమావేశాలు, మేయర్‌ సారధ్యంలోని సమావేశాలకు సైతం హాజరవడం గమనార్హం. 

Updated Date - 2022-10-08T05:27:34+05:30 IST