‘దళిత బంధు’ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-19T07:00:55+05:30 IST

‘దళిత బంధు’ పథకానికి అర్హులందరూ దర ఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అన్నారు.

‘దళిత బంధు’ను సద్వినియోగం చేసుకోవాలి
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

తిరుమలగిరి, మే 18: ‘దళిత బంధు’ పథకానికి అర్హులందరూ దర ఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల పరిషత్‌ కార్యాల యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లా డారు.  తిరుమలగిరి మండలాన్ని ‘దళిత బంధు’ పైలెట్‌ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారన్నారు. ‘దళిత బంధు’ లబ్ధిదారులకు సకా లంలో యూనిట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు అందించాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు అందిస్తామన్నారు. నియోజక వర్గంలోని సమస్యలను తన  దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాన న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత సురేందర్‌ రావు, జడ్పీటీసీ దూపటి అంజలి రవీందర్‌, వైస్‌ ఎంపీపీ బొడ్డు సుజాత, ఎంపీడీవో ఉమేష్‌, తహసీల్దార్‌ సంతోష్‌ కిరణ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌,  వివిధ శాఖల అధికా రులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  



Updated Date - 2022-05-19T07:00:55+05:30 IST