Dalit bhandu Issue: మంత్రి ఇంద్రకరణ్ ఇలాకాలో దళితబంధు రగడ

ABN , First Publish Date - 2022-09-19T19:59:17+05:30 IST

మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇలాకాలో దళిత బంధు రగడ నెలకొంది.

Dalit bhandu Issue: మంత్రి ఇంద్రకరణ్ ఇలాకాలో దళితబంధు రగడ

నిర్మల్: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Allola indrakaran reddy) ఇలాకాలో దళిత బంధు (Dalit bhandu) రగడ నెలకొంది. అనర్హులను ఎంపిక చేశారంటూ మంత్రి  గొల్లమాడ గ్రామస్తులు ఇంటికి చేరుకున్నారు. అర్హతలేకున్నా స్థానిక సర్పంచ్ అనుచరులకు దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. గ్రామంలో సర్వే నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సహాయకుడికి గ్రామస్తులు వివరించారు. ఈ విషయంపై కలెక్టరేట్‌లోనూ గొల్లమాడ దళితులు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2022-09-19T19:59:17+05:30 IST