సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదని.. మధ్యప్రదేశ్‌లో..

ABN , First Publish Date - 2020-11-30T04:55:35+05:30 IST

సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదని ఓ దళితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మధ్యప్రదేశ్

సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదని.. మధ్యప్రదేశ్‌లో..

భోపాల్: సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదని ఓ దళితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణా నగరంలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్జీ రామ్ అహిర్వార్ అనే 50 ఏళ్ల రైతు పొలంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతడి వద్దకు యష్ యాదవ్, అంకేష్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అగ్గిపెట్టె అడిగితే ఇవ్వలేదని లాల్జీని ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో లాల్జీకి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం లాల్జీని ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి హత్య కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి 8.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా.. గత కొద్ది నెలలుగా మధ్యప్రదేశ్‌లో అనేక మంది దళితులపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం దళితులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - 2020-11-30T04:55:35+05:30 IST