దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ‘దళితబంధు’: గంగుల

Published: Fri, 21 Jan 2022 20:21:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు: గంగుల

కరీంనగర్‌: దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ధి చెందుతారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసినవారు నేడు దళితబంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు. ఈ పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కమలాకర్‌ ఆకాంక్షించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.