ప్రతీ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు

ABN , First Publish Date - 2022-01-23T04:54:46+05:30 IST

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని మార్చి 7 లోగా అందజేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సీఎ్‌సతో కలిసి శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్సీ సంక్షేమశాఖ, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధు పథకం అందజేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన

ప్రతీ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు

ఫిబ్రవరి 5 లోగా లబ్ధిదారుల ఎంపిక, మార్చి 7 వరకు పంపిణీ

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


మెదక్‌ రూరల్‌/సంగారెడ్డిరూరల్‌, జనవరి 22: ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని మార్చి 7 లోగా అందజేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సీఎ్‌సతో కలిసి శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్సీ సంక్షేమశాఖ, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధు పథకం అందజేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని అబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రభుత్వం అందజేసే రూ. పది లక్షలకు తగిన పథకాలను రూపొందించాలని సూచించారు. ప్రతీ అసెంబ్లీ నియోజవకర్గంలో దళితబంధు అమలుకు ప్రత్యేకాధికారిని నియమించాలని సీఎస్‌ సోమే్‌షకుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 5 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. శాసనసభ్యులు, జిల్లా మంత్రి సమక్షంలో ఎంపిక చేపట్టాలని, వారికి ప్రత్యేకంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరవాలని ఆదేశించారు.


మెదక్‌ జిల్లాలో 39,846 దళిత కుటుంబాలు

మెదక్‌ జిల్లాలో 39,846 దళిత కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలు పూర్తిగా, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు పాక్షికంగా జిల్లా  పరిధిలోకి వస్తాయని తెలియజేశారు. లబ్ధిదారుల ఎంపికకకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


సంగారెడ్డి జిల్లాలో 68,243 మంది

సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ జనాభా 2,76,971 మంది ఉన్నారని, దళితబంధు పథకంతో వీరిలో 68,243 మంది లబ్ధి పొందనున్నారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జిల్లాలో దళితబంధు పథకం అమలుపై ఈ నెల 23న మంత్రి ఆధ్వర్యంలో కార్యాచరణ సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సదస్సులో మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు రాజార్షిషా, వీరారెడ్డి, డీఆర్డీవో పీడీ శ్రీనివా్‌సరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి నర్సింహారావు, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T04:54:46+05:30 IST